లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీలో శాసనసభ సమావేశాలకు వేళాయే..

Published

on

Ap Assembly Sessions : ఏపీలో నేటి నుంచి శాసనసభా సమరం ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు శాసనసభ మొదలుకానుంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు.

శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా… ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం రెడీ అయ్యింది.మరోవైపు ఈ సమావేశాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సమావేశాలు ఇవాళ ప్రారంభంకాబోతున్నాయి.

ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, పది గంటలకు శాసన మండలి ప్రారంభంకానుంది. అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం..కోవిడ్‌ నెగెటివ్‌ ఉంటేనే అనుమతి


కోవిడ్‌ నేపథ్యనంలో ఎక్కువ రోజులు కాకుండా.. ఐదు రోజుల్లోనే ముగించాలని డిసైడ్‌ అయ్యింది.

ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు జరపాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం కనీసం పది రోజులైనా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది.

ప్రజల సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం ఎక్కువ రోజులు సభను జరపాలని కోరుతోంది.ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలోనూ టీడీపీ ఇదేవిషయాన్ని కోరనుంది. అసెంబ్లీ నిర్వహణపై మండలి చైర్మన్‌ షరీఫ్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించిన సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని చైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు.

ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు అన్నారు. అలాగే జీరో అవర్ లో స్థానిక సమస్యల పరిష్కారం అయ్యేందుకు ఉపయోపడుతుందన్నారు.

అయితే ఈ విషయం స్పీకర్ తమ్మినేని సీతారాం కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కొశ్ఛనవర్ కోసం పట్టుపట్టనుంది.ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

15 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకోవాలని భావిస్తోంది. కొన్ని బిల్లులకు ఈనెల 27న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లు, ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ బిల్లు, ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ను సవరిస్తూ ఆన్‌లైన్ గేమింగ్‌, గ్యాంబ్లింగ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టేలా ఆర్డినెన్స్‌కు ఆమోదం, గేమింగ్‌ చట్టం సవరణ బిల్లు, పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది.బిల్లులన్నీ సిద్ధం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రభుత్వానికి సూచించారు. స్పీకర్ సూచనను బట్టి ఇవాళ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం వుంది.

ఇక అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు హోంవర్క్‌ చేసి రావాలని సిఎం జన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

ప్రతిపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా గట్టిగా సమాధానం చెప్పాలని మంత్రి వర్గ సహచరులకు ఆయన సూచించారు.

మంత్రులంతా సభా వ్యవహారాల, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి తో సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం జగన్‌. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.

ఇప్పటికే సీఎం, ఇతర ముఖ్యుల కాన్వాయ్‌ల రిహార్సల్స్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను గుర్తించారు.ముఖ్యంగా సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీ చుట్టు పక్కల ఎటువంటి ఆందోళనలు, అసాంఘిక కార్యాకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

కొవిడ్ ను దృష్టిలో పెట్టుకుని… కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరవాతే ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందికి అనుమతించనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరిగినా ఎక్కువ సమస్యలను ప్రస్తావించాలని టీడీపీ పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు ప్రభుత్వం 15 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీంతో ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరుగడం ఖాయంగా కనిపిస్తోంది.అసెంబ్లీ సమావేశాలకు అధికార, విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు అధికార పార్టీ సిద్ధమవగా.. ప్రభుత్వ కార్యక్రమాల్లోని లోపాలను ఎత్తిచూపడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడానికి టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.

ఈ సారి సభలో ఏఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి.. ? ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏం చేయబోతుంది? అధికార పక్షం వాటిని ఎలా కౌంటర్‌ చేయబోతుంది? ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు సభ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ సమావేశాల్లో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

ఇందుకోసం అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ఎత్తులు వేస్తోంది.

అనేక కీలక అంశాలపై చర్చ జరపాలంటూ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించింది. పోలవరం, టిడ్కో ఇల్లు, వరద నష్టం, అక్రమ వసూళ్లు, ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, రాజధాని రైతుల ఆందోళన తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి టీడీపీ రెడీ అయ్యింది.అంతేకాదు.. కరోనా రోగులు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, సబ్‌ప్లాన్‌ నిర్వీర్యం, ప్రభుత్వ దుబారా వ్యయం, స్థానిక సంస్థల నిర్వహణపై ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని నిర్ణయించింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడతామని టీడీపీ తెలిపింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *