లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

గర్భిణి కోడలిపై మరిగే టీ పోసిన అత్త..

Published

on

AP Aunt harassing : కోడలిని వేధించే ఓ అత్తగారు ఆమె గర్భిణి అని కూడా చూడకుండా మరిగే మరిగే టీ పట్టుకొచ్చిమీదపోసింది. దీంతో ఆ కోడలు గాయాలపాలై పాపం విలవిల్లాడిపోయింది. అత్తమామలతో పాటు కట్టుకున్న భర్త కూడా తనను నానా రకాలుగా వేధిస్తున్నా భరించింది..కానీ కనికరం లేని ఆ అత్త గర్భంతో ఉన్న కోడలిపై పొగలు కక్కుతున్న టీ పోయటంతో గాయాలతో బాధలు పడుతున్న ఘటన ఏపీ కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో జరిగింది.

చిన్నకడబూరు గ్రామానికి చెందిన ఎల్లప్ప, ఎల్లమ్మల కూతురు గీత. ఆమెను అదే గ్రామానికి చెందిన బోయ అంజినయ్య, నర్సమ్మల కొడుకు రామాంజికి ఇచ్చి పెళ్లి చేశారు. గీతకు,రామాంజికి ఓ కూతురు పుట్టింది. ఆ తరువాత గీత మరోసారి గర్భవతి అయ్యింది.

ఈక్రమంలో మొదటి కాన్పులో ఆడపిల్లను కన్నదని రెండోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోననే అనుమానంతో అత్తమామలు, భర్త గీతను వేధిస్తున్నారు. వేధింపుల్లో భాగంగా మంగళవారం (జనవరి 5,2021) గర్భంతో ఉన్న కోడలితో గొడవపడిన అత్త నర్సమ్మ వేడి వేడిగా మరిగిపోతున్న టీ పోయింది.

దీంతో గీతకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ కు తరలించటంతో గీత చికిత్స పొందుతోంది. ఈ ఘటన పోలీసులకు తెలియటంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు గీతను ప్రశ్నించగా..అత్త, మామ, భర్త తనను వేధిస్తున్నారని గీత చెప్పటంతో ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.