లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

చంద్రబాబు వార్నింగ్ : జగన్‌కు అధికారమిస్తే మొత్తం దోచుకుంటారు

విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే

Published

on

AP CM Chandrababu Fires On YS Jagan Mohan Reddy

విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే

విజయనగరం : వైసీపీ చీఫ్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచుకుంటారని, రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు ఒక్క అవకాశం ఎందుకివ్వాలని అని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

జగన్ కేసుల కథ ఏంటో జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పాలి అని చంద్రబాబు అన్నారు. జగన్ పై ఉన్న 12 కేసుల్లో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ పైనా చంద్రబాబు విమర్శలు చేశారు. కేంద్రం నుంచి ఏపీకి రూ.75వేల కోట్లు రావాలని పవనే చెప్పారని గుర్తు చేసిన చంద్రబాబు.. ఇప్పటికీ ఆ నిధుల గురించి పవన్ మాట్లాడలేదని, బీజేపీని ప్రశ్నించలేదని విమర్శించారు.

ప్రధాని మోడీ నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడామని తెలిపారు. విభజన హామీలు నెరవేర్చాలని అడిగితే… ఐటీ దాడులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. విశాఖ జోన్‌ ఇచ్చామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించిన చంద్రబాబు… వాల్తేరు డివిజన్‌ లేకుండా… జోన్‌ ఇచ్చి ఏం లాభం అని ప్రశ్నించారు. టీడీపీని గెలిపించే బాధ్యత మీదే అని చంద్రబాబు అన్నారు. మీ భవిష్యత్తు నా భరోసా అని సీఎం సీఎం ఇచ్చారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *