ap cm jagan launched Connect to Andhra webportal

కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌సైట్‌ పోర్టల్‌ను ఏసీ సీఎం జగన్‌ ఆవిష్కరించారు. శుక్రవారం (నవంబర్ 8, 2019) అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. సీఎం జగన్ ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ ఉంటుంది. సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్ధలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. 

రాష్ట్రం మీద ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదో మంచి అవకాశం అని.. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి సీఎం అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయవచ్చని తెలిపారు. 
 

Related Posts