లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వీళ్లు మనుషులేనా? టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం

Published

on

CM Jagan serious TDP members : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడి వేడిగా సాగాయి. టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడే మాటలు వినపడకూడదని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభకు ఎందుకు వస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదన్నారు.టీడీపీ సభ్యులు పోడియం ముందుకు వచ్చి గట్టిగట్టిగా అరుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు వీళ్లు మనుషులేనా అని మండిపడ్డారు. సభలో కనీసం సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు.


టిడ్కోకు సంబంధించి చర్చ జరిపించాలని టీడీపీ సభ్యులకు ఉద్దేశమే లేదని విమర్శించారు. టిడ్కోకు సంబంధించి ఇంతకముందే అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చామని..చంద్రబాబు స్కీమ్ ముద్దా… జగన్ స్కీమ్ ముద్దా అని ప్రజలే నిర్ణయం చేసుకోండని చెప్పినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు జగన్ స్కీమ్ ముద్దు అని అంటున్నారని తెలిపారు.టీడీపీ సభ్యులు కుటిల బుద్ధితో ఆలోచిస్తున్నారని విమర్శించారు. దళితుడిని పోడియం ముందు ఉంచి స్పీకర్ దగ్గరికి వచ్చేటట్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం 23 స్థానాలున్న టీడీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో 2 నుంచి 3 మూడు స్థానాలకు పడిపోతుందని చెప్పారు.డిసెంబర్ 15న రూ.1227 కోట్లు బీమా చెల్లిస్తున్నామని ప్రకటించారు. జగన్ ఒక మాట చెబితే అది చేస్తారని ప్రజలకు తెలుసన్నారు. జగన్ విశ్వసనీయత ఏమిటో ప్రజలకు తెలుసు అని చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *