లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

అమ్మవారి సేవలో : ఇంద్రకీలాద్రికి సీఎం జగన్.. ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు

Published

on

Ys Jagan visits Durga Temple : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించారు. దుర్గగుడి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం రూ.70 కోట్లను సీఎం జగన్ మంజూరు చేశారు.ఘాట్ రోడ్ మార్గంలోనే దుర్గగుడికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. ఆలయంలో వేదపండితులు, అధికారులు పూర్ణకుంభంతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు.దసరా ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు.సీఎం జగన్‌ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ తదితరులు ఉన్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని సీఎం జగన్ పరిశీలించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *