ఏపీలో కొనసాగుతున్న పాజిటీవ్ ట్రెండ్. కొత్త కేసులకన్నా, రికవరీ ఎక్కువ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

AP coronavirus Update: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 76,000 టెస్ట్‌లు చేయగా, 7,855 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండువారాలుగా పాజిటీవ్‌కేసుల్లో ఏంతో కొంత తగ్గుదల కనిపిస్తూనే ఉంది.

24 గంటల్లో 8,807 మంది పూర్తిగా రికవరీ అయ్యారు. అంటే, కొత్తగా వచ్చిన కేసులుకన్నా, ఇంటికెళ్లినవాళ్లే ఎక్కువ.

కోవిడ్‌తో చిత్తూరులో 8, అనంతపూర్ లో 6, గుంటురులో 6, కృష్ణ, ప్రకాశం, విశాఖలో ఐదురుగు చొప్పున, తూర్పు గోదావరిలో నలుగురు, కడప, కర్నూలు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, విజయనగరంలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున చనిపోయారు.


Related Posts