ap cs lv subramanyam transferred

షోకాజ్ నోటీసు అడిగితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. బాపట్లలోని HRD డైరెక్టర్ జనరల్‌గా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంచార్జ్ సీఎస్‌గా.. నీరబ్ కుమార్‌ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం నీరబ్ కుమార్ సీసీఎల్‌లో పనిచేస్తున్నారు. ఐతే.. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులు.. జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ పేరిట ఉండటమే ఇప్పుడు పెద్ద చర్చ దారితీసింది. ప్రవీణ్ ప్రకాశ్‌కు.. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసులు జారీ చేసిన 3 రోజుల్లోనే.. బదిలీ వేటు పడటం ఇప్పుడు ఏపీ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ యంత్రాంగంలోని వాళ్లంతా.. ఇప్పుడు దీనిపైనే చర్చించుకుంటున్నారు.

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి, జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ మధ్య తలెత్తిన వివాదమే.. ఈ బదిలీ వేటుకు కారణమని అధికార యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా.. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా.. జరిగిన ఏపీ కేబినెట్‌ అజెండాలో.. అంశాలను చేర్చడంలో విధివిధానాలు పాటించలేదని.. ప్రవీణ్ ప్రకాశ్‌కు.. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసులిచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. కానీ.. నోటీసులిచ్చిన 3 రోజుల్లోనే సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను.. HRD డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ.. ప్రవీణ్ ప్రకాశ్ పేరిట ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడు దీనిపైనే బిగ్ డిబేట్ నడుస్తోంది.

సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు.. ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసులివ్వటానికి 2 ప్రధాన కారణాలున్నాయి. కేబినెట్‌ ఎజెండా తయారీతో పాటు.. చర్చకు రావాల్సిన అంశాలను పొందుపరచడంలో ప్రవీణ్‌ ప్రకాశ్ బిజినెస్‌, కండక్ట్ రూల్స్ పాటించలేదని నోటీసుల్లో తెలిపారు. YSR లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ఫైలును.. కేబినెట్ అజెండాలో పొందుపరిచేందుకు.. ప్రవీణ్ ప్రకాశ్.. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దగ్గరికి ఫైలును పంపారు. ఐతే.. బిజినెస్ రూల్స్ ప్రకారం.. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంతో పాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఎల్వీ సుబ్రమణ్యం.. ఫైలును తిప్పి పంపారు. కానీ.. అవేవీ పాటించకుండా.. YSR అవార్డుల ఫైలును.. జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ నేరుగా కేబినెట్ ముందుంచారు. బిజినెస్ రూల్స్ ప్రకారం.. ఫైలుపై సంబంధిత శాఖ నుంచి తప్పనిసరిగా ఆమోదం తీసుకోవాలి. కానీ.. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుల ఫైలుకు.. ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు. పైగా దీనికి సంబంధించి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టమైన సూచనలిచ్చినా వాటిని పట్టించుకోకుండా ఆ ఫైలును కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. 

READ  స్కీములు మావి, పేర్లు మీవా? జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు గుస్సా

దీంతో పాటు గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన ఫైలుపైనా వివాదం తలెత్తింది. అప్పటికే సీఎం జగన్.. ఈ ఫైలుపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన మెమోను.. జీఎడీలోని కేబినెట్ విభాగానికి అందజేశారు. కానీ.. గ్రామ న్యాయాలయాల ఫైలును.. కేబినెట్ ముందు పెట్టడంలో ప్రవీణ్ ప్రకాశ్ ఫెయిలైనట్లు సీఎస్ నోటీసుల్లో తెలిపారు. నిర్ణయాలు తీసుకోవడంలో, ఫైళ్ల సర్క్యులేషన్‌లో ప్రవీణ్‌ ప్రకాశ్‌ నిబంధనలు పాటించలేదని, ఉద్దేశపూర్వకంగా.. పై అధికారుల ఆదేశాలు బేఖాతరు చేసి.. కండక్ట్‌ రూల్స్‌ ఉల్లంఘించారన్నారు. వీటికి.. వారంలోగా వివరణ ఇవ్వాలని.. ప్రవీణ్ ప్రకాశ్‌కు ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు సీఎస్ఎల్వీ సుబ్రమణ్యం. ఈయన నోటీసులిచ్చిన 3 రోజులకే.. ఆయన బదిలీ ఉత్తర్వులిచ్చి.. అందరికీ షాకిచ్చారు.

ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్‌ను.. సీఎం జగన్ తన ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. దీంతో పాటు సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలను అప్పగించారు. కొన్నాళ్ల క్రితం.. సీఎస్‌కు ఎలాంటి సమాచారం లేకుండా స‌ర్వీస్ రూల్స్ మార్పులు.. చేర్పులకు సంబంధించిన విష‌యంలో .. ఎలాంటి ఫైల్ రన్ చేయకుండా.. ప్రవీణ్ ప్రకాశ్ సెక్రటేరియట్ సర్వీస్ రూల్స్‌లో.. మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మరో 5 నెలలు సర్వీసు మాత్రం ఉంది. ఈలోగా ఇలాంటి బదిలీపై  అటు అధికారుల్లోనూ, ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చగా మారింది. 

Related Posts