‘రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేం’…ఎస్ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ లేఖ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

AP CS Neelam Sahni letter EC : ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు ఈ మేరకు లేఖ రాశారు. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని…పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తెలియజేస్తామని స్పష్టం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కోవిడ్ తీవ్రత కొనసాగుతోందన్నారు. ప్రాజల ప్రాణాలు కాపాడటం అత్యంత ముఖ్యమైన అంశం అన్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల రాష్ట్రంలో6,890 మంది చనిపోయారని తెలిపారు. కేంద్రం అనేక రాష్ట్రాలను హెచ్చరించింది. కేంద్ర మార్గాదర్శకాలకు లోబడి కోవిడ్ నియంత్రణా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పోలీసులు కూడా కోవిడ్ నియంత్రణలో భాగస్వాములయ్యారని తెలిపారు.


ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ముహుర్తం ఖరారు


కోవిడ్ నియంత్రణలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవలంభిస్తుందన్నారు. ఏపీలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఇవాళ నిమ్మగడ్డ గవర్నర్‌ ను కలవనున్న సమయంలో సీఎస్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Tags :

Related Posts :