బాలమిత్ర పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాం : గౌతం సవాంగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జువైనల్‌ జస్టిస్ చట్టం అమలుపై ఏపీ డీజీపీ కార్యాలయంలో గురువారం అక్టోబర్ 1న , రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌ నిర్వహించారు. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి  గారు, న్యాయమూర్తులు  విజయలక్ష్మి గారు, గంగారావు గారు పాల్గొనగా…..  డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గారు, సీఐడీ చీఫ్ సునీల్ ‌కుమార్ గారు వెబినార్ ద్వారా పాల్గొన్నారు.

పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్ గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి గల కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేదానిపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.వీధి బాలలను రక్షించడం పోలీసుల విధి నిర్వహణలో భాగం అని స్పష్టం చేశారు గౌతమ్‌ సవాంగ్‌ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.అనేక మంది చిన్నారులకు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలమిత్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సెమినార్‌లో అనేక అంశాలు చర్చించాము. చర్చించిన ప్రతి అంశాన్ని పరిష్కారం అయే విధంగా చర్యలు తీసుకుంటాం అని గౌతమ్‌ సవాంగ్‌ గారు పేర్కొన్నారు.

Related Posts