లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఎన్నికల విధుల్లో పాల్గొనాలంటే మా డిమాండ్లు తీర్చాలి

Published

on

ap employee unions demands : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటామంటూనే.. ఏపీ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ కోరారని.. అయితే.. వీలైనంత త్వరగా తమకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని సీఎస్‌ను అడిగామని ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి చెప్పారు.

ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఎన్నికలను రీ షెడ్యూల్‌ చేయాలని.. ఎన్నికల డ్యూటీ ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరారు.

ఇవాళ జరిగే ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పాల్గొంటామని.. కోర్టు ఆదేశాలను అనుసరించి తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామన్నారు. అయితే 50 సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులకు విధుల నుంచి మినహాంపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లు, అంశాలన్ని ఇవాళ జరిగే భేటీలో SEC దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఏపీ ఎన్జీవో నేతలు. కరోనాతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.