లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

నిమ్మగడ్డ సెన్సూర్ ఆర్డర్ ను వెనక్కి పంపిన సర్కార్

Published

on

ap government

ap government : ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెన్సూర్ ఆర్డర్ ను ఏపీ సర్కార్ తిప్పి పంపింది. అధికారుల వివరణ కూడా పెనాల్టీ సిఫార్సు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లపై ఎన్నికల కమిషనర్ సెన్సూర్ ఆర్డర్ కు బుధవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ అధికారం ఎస్ఈసీకి లేదని ప్రభుత్వం తిప్పి పంపడం గమనార్హం. అధికారుల వివరణ లేకుండా..ప్రొసీడింగ్స్ ను జారీ చేయలేరని ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకొనే అధికారం లేదని తెలిపింది.

పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి..రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్‌ అడ్డు తగిలారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియంగా ఉన్న క్రమంలో..ఆ ఇద్దరు అధికారుల బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు తలత్తే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ…ఆ ఇద్దరిపై సెన్సూర్ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ..మంగళవారం వేరుగా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వాహణలో విఫలం చెందినట్లుగా సర్వీసు రికార్డులో నమోదు చేయాలని సూచించారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలుంటే ఏడాది పాటు ..పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెబుతున్నాయి