కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు…ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ జైలుకు తరలించాలని నిర్ణయించింది. కరోనా నెగెటివ్ ఉన్న ఖైదీలను మాత్రమే సాధారణ జైలుకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్ జైళ్లు కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్నాయి.

కరోనా నేపథ్యంలో ఖైదీల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించే విధంగా ఈ నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి నేరస్తులు కోర్టు ఆదేశాలనుసారం స్పెషల్ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. జైలు సిబ్బంది ప్రత్యేకమైన కిట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక జైళ్ల నుంచి ఖైదీలెవరూ పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

ఎందుకంటే కరోనా ఖైదీలు ఆస్పత్రి నుంచి పారిపోతుండటం, వారి నుంచి ఇతరుకు కూడా సోకి కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది అవకాశముంటుందని కాబట్టి ఖైదీల విషయంలో కూడా కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ వ్యక్తులను కోవిడ్ ఆస్పత్రికి తరలించే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లళ్లో టెస్టులు చేసేందుకు మెడికల్ అధికారితోపాటు పారా మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related Posts