లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పంచాయితీలకు ప్రభుత్వం నజరానా: ఎన్నికల్లో ఎకగ్రీవాలైతే భారీ బహుమానం

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన రూ.20లక్షల వరకు ప్రోత్సాహకంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలు ఉంటే రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల జనాభాకు రూ.15లక్షలు, 10వేల జనాభా దాటితే రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

CM YS Jagan launches Rythu Bharosa Kedras: Here are services rendered by the scheme