AP govt bringing new 108, 104 Ambulances for govt

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు : జూలై 1 నుంచి కొత్త అంబులెన్స్‌లు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవత్మాకమైన మార్పుల దిశగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కార్ ఆస్పత్రులను, పీహెచ్‌సీలను నాడు-నేడు పేరుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్.

జూలై 1 నుంచి కొత్తగా మరికొన్ని 108, 104 నూతన వాహనాల సేవలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే సిద్ధమైన వాహనాలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 203.47 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసినట్టు ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జన్ రావు చెప్పారు. 108 వాహనాలకు సంబంధించి 412 కొత్త వాహనాలు వస్తున్నా్యని తెలిపారు.

104 కొత్త వాహనాలు కూడా సుమారుగా 656 వాహనాలు తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో 108లో కొత్త అంబులెన్స్ లు అందుబాటులో రానున్నట్టు తెలిపారు. జిల్లాల్లో హెడ్ క్వార్టర్ లోనూ మెటర్నిటీ సంబంధిత సమస్యలు ఎదురయినప్పుడు ట్రాన్స్ పోర్టేషన్ అందించడానికి వీలు పడుతుందని చెప్పారు.

మొబైల్ వెంటిలేటర్ సహా అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీపీఎస్, ట్రాకింగ్ సౌకర్యం వ్యవస్థ కూడా ఉంటుందని తెలిపారు. బాధితులు కాల్ చేసిన వెంటనే అతి తక్కువ సమయంలోనే ఘటనా స్థలికి చేరుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంబులెన్స్ లను తీసుకొస్తున్నట్టు చెప్పారు.

Read:ఏపీ రీస్టార్ట్ ప్యాకేజీ : ఎంఎస్ఎంఈలకు రెండో విడత ఆర్థిక ప్రోత్సాహం!