లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

Published

on

ap govt cancels degree pg exams

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల క్షేమాన్ని కాంక్షిస్తూ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల ఫైనల్ సెమిస్టర్‌ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. అలాగే, డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

గ్రేడింగ్ లేదా మార్కులు:
డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేదు. పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థుల జీవితాలను రిస్క్ లో వేయడమే అని అంతా అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు రద్దు చేయాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏకంగా పరీక్షలే రద్దు చేస్తోంది.

ఏపీలో ఒకేరోజు 8 కరోనా మరణాలు, కొత్తగా 462 కేసులు:
ఇది ఇలావుండగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో 462 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9వేల 834కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనాతో మృతి చెందినట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 119కి చేరింది.

విజయవాడలో లాక్‌డౌన్ ఉత్తర్వులు విత్ డ్రా:
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. వియవాడలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నామని చెప్పిన ఆయన కాసేపట్లోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ లేదని చెప్పారు. ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయవాడలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. జూన్ 26 నుంచి వారం రోజులపాటు విజయవాడలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇప్పుడున్న పరిస్థితులే ఉంటాయని కలెక్టర్ చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ లాక్‌డౌన్:
మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు వ్యాపారులకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకుల కార్యకలాపాలు యథాతథమేనని అన్నారు. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించకుండా బయటికి వస్తే రూ. 100 జరిమానా విధిస్తామన్నారు. 

ఆ మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్:
ఇప్పటికే అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో లాస్ట్ ఆదివారం(జూన్ 21,2020) నుంచి లాక్ డౌన్ మళ్లీ అమల్లోకి తెచ్చారు. ఆదివారం నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆయా జిల్లాల్లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేశారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

Read: ప్రతి లోక్ సభ నియోజక వర్గం ఓ జిల్లా : సీఎం వైస్ జగన్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *