Ap Govt. Letter to Election Commission over local bodies

రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లొద్దు : ఈసీకి ప్రభుత్వం లేఖ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాజధానిలోని కొన్ని గ్రామాలకు ప్రత్యేక కార్పొరేషన్ గా, ఇతర గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం దిశగా అధికారులు ప్రతిపానదలు రూపొందించారు. 

ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి పురపాలికలో కలపాలని, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లిలో కలపాలని ప్రతిపాదనలు ఇచ్చారు. మిగిలిన గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలక కానుంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడునుంది. ఈ నెల 17 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు సూచించింది. అలాగే పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మార్చి 3 వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. 

రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని, మూడు దశలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. 

మరోవైపు ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతుంటే… పాలన వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను చెప్పే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జీఎన్ రావు కమిటి, బీసీజీ నివేదికలు వికేంద్రీకరణకే మొగ్గుచూపాయి.

మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ ఆధ్యయనం చేస్తోంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటి ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. రెండు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. 

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 29గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బలగాలతో పికెటింగ్ చేస్తున్నారు. 27 రోజులుగా రైతులు, ప్రజల ఆందోళనలు చేపడుతున్నారు. 144 సెక్షన్, 30యాక్ట్ అమల్లో ఉందని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రాజధాని ప్రాంతవాసులు, రైతులు ఏమాత్రం తగ్గట్లేదు. ఒక్క అమరావతే ముద్దు… మూడు రాజధానులు వద్దంటూ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ… వైసీపీ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

READ  రాజధాని భూముల్లో 4 వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ : కేబినెట్ సబ్ కమిటీ నివేదిక

అమరావతి రైతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తుంది. యువత…రైతులకు మద్ధతు తెలుపుతుంది. ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా అమరావతి రైతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రవాసాంధ్రుల నుంచి కూడా మద్ధతు లభిస్తోంది. సేవ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో అమెరికాలో ఎన్నారైలు వివిధ నగరాల్లో సమావేశాలు, నిరసనలు చేపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి…అధికార వికేంద్రీకరణ కాదు..అంటూ ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. కాలిఫోర్నియా, ఒమాహ, కాన్సాస్‌ సిటీ, కొలంబస్‌, డల్లాస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనలు, సమావేశాలు చేపట్టారు. 
 

Related Posts