లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీలో స్కూళ్లు : తరగతి గదిలో 16 మందే, మార్గదర్శకాలు ఇవే

Published

on

AP Govt school education department guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. 2020, నవంబర్ 02వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహించనుంది. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించింది.విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో కేవలం 16 మంది కూర్చోవాలని, వీరి మధ్య 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజు విడిచి రోజు తరగతుల నిర్వాహణ, ఆన్ లైన్, ఆఫ్ లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో రూపొందించారు.నవంబర్ లో ఒక్కపూట బడులు
* నవంబర్ నెలంతా ఒక్కపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటాయి.
* మధ్యాహ్న భోజనం ముగిశాక..పిల్లలను ఇంటికి పంపించి వేస్తారు.
* విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.
* 9వ తరగతికి ఒకరోజు పెడితే..మరునాడు 10వ తరగతి పిల్లలకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది.


స్కూల్స్, కాలేజీలు రీ ఓపెన్ – మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి


* 10వ తరగతి చదివే వారికి ప్రతి రోజు తరగతులు ఉంటాయి.
* నవంబర్ 23వ తేదీ నుంచి 6, 8 తరగతులకు ఒక రోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.
* డిసెంబర్‌ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.* 750 మందికి ఎక్కువగా విద్యార్థులున్నట్లు అయితే…వారిని మూడు బ్యాచ్ లుగా విభజించి..మూడేసి రోజులకు తరగతులు నిర్వహించాలి.
* టీచర్లు మాత్రం ప్రతి రోజు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంటుంది.
* నవంబర్‌ 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్‌ ఉంటుంది.* తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి.
* పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి.
* మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్‌ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.* ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.
* ఉదయం స్కూళ్లు తెరవగానే కోవిడ్‌ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *