30లక్షల కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త, ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి ఇవ్వనున్న ప్రభుత్వం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు… ఆ రోజు రాష్ట్రంలోని పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నా అన్నారు. ధర్మం ఎప్పుడైనా చివరకు గెలుస్తుందన్న సీఎం జగన్, మంచి ఆలోచనతో మనం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. దురదృష్టవశాత్తూ టీడీపీ నాయకులు ఇళ్లపట్టాలపై కోర్టులకు వెళ్లారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. డి-పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఇప్పటికిప్పుడే ఇళ్ల పట్టాలు ఇవ్వొచ్చన్నారు. అయితే డి-పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్ చెప్పారు.

62వేల ఎకరాలు సేకరణ, ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.7500 కోట్లు ఖర్చు:
30లక్షల కుటుంబాలకు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి ఇవ్వనున్నామని, రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అని సీఎం జగన్ చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిపోయే పని అన్న సీఎం జగన్, కలెక్టర్లు దీనిపై ఫోకస్‌ పెట్టాలన్నారు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించామన్న సీఎం జగన్, ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చు చేశామన్నారు. పేద ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో 3.5లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చారని చెప్పిన సీఎం జగన్, అందులోనూ రూ.1300 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు.

YSR Village Health Clinics in andhra pradesh

ఇళ్ల పట్టాల గురించి సీఎం జగన్ కామెంట్స్:
* దురదృష్టవశాత్తూ టీడీపీ నాయకులు ఇళ్లపట్టాలపై కోర్టులకు వెళ్లారు
* కోవిడ్‌ కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదు
* డి-పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఇవాళైనా ఇవ్వొచ్చు
* డి-పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది
* ధర్మం ఎప్పుడైనా చివరకు గెలుస్తుంది
* మంచి ఆలోచనతో మనం చేస్తున్నాం
* ఏపీలో 20 శాతం మంది జనాభాకు ఇళ్లపట్టాలు ఇస్తున్నాం
* 30లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నాం
* మంచి కార్యక్రమానికి ఎప్పటికైనా దేవుడు ఆశీర్వదిస్తాడు
* సుప్రీంకోర్టులో పేదల ఇళ్లపట్టాల కార్యక్రమానికి సానుకూల నిర్ణయం వస్తుందని నమ్మకంతో ఉన్నాం

* ఆగస్టు 15 నాటికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం
* ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు… ఆ రోజు పేదలకు కూడా స్వాతంత్య్రం వస్తుందని అనుకుంటున్నా
* వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను
* ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిపోయే పని
* కలెక్టర్లు ఫోకస్‌ పెట్టాలి
* ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించాం
* పేద ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం
* ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశాం
* మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం
* రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు

READ  నవంబర్ 1 నుంచి అమలు : రిజిస్ట్రేషన్ శాఖలో సీఎం జగన్ సంచలన సంస్కరణలు

* గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు
* అందులోనూ రూ. 1300 కోట్లు బకాయిలు పెట్టారు
* అర్బన్‌ హౌసింగ్‌లో 7 లక్షల ఇళ్లు కట్టాలనుకున్నారట, 3లక్షల ఇళ్లు మాత్రమే కట్టడం మొదలుపెట్టారు, అవి కూడా సగంలో ఆపేశారు
* దీనికి సంబంధించిన బకాయిలు రూ.3వేల కోట్లు
* పేదలకు ఇళ్లను కట్టించాల్సిన ప్రభుత్వం, దారుణంగా వ్యవహరించింది
* ఇవాళ 30లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ చేయించి 15 లక్షల ఇళ్లు కట్టడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం
* ఇవన్నీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన నెల రోజులకే ప్రారంభిస్తాం
* గతానికి ఇప్పటికీ తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది
* కలెక్టర్లు ఈ పురోగతిని, కార్యక్రమంలో ముందడుగు వేసే తీరును వదిలి పెట్టవద్దు
* లే అవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలు చేపట్టాలి
* పట్టా డాక్యుమెంట్లలో ఫొటోలు పెట్టడం, ఫ్లాట్‌ నంబర్‌, హద్దులు పేర్కొనడం చేయాలి
* ఈ టైం గ్యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
* చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్‌ చేయించడం దీని వల్ల వీలవుతుంది

* అలాగే బిల్లులు పెండింగ్ లో లేకుండా చూడండి
* ఇళ్లపట్టాల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయండి
* ఇంకా ఎవరైనా అర్హత ఉండి పొరపాటున రాకపోతే.. దరఖాస్తు చేస్తే, ఎంక్వైరీ చేసిన తర్వాత 90 రోజుల్లోనే పట్టా వారికి ఇవ్వాలి
* జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే వారితో దరఖాస్తు చేయించాలి.

Read Here>>ప్రైవేట్ సెక్టార్‌లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే, జగన్ బాటలో బీజేపీ సీఎం

Related Posts