ap inter results tomorrow

ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు.. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు(జూన్ 12,2020) ఇంటర్

ఏపీలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు ఎట్టకేలకు విడుదల కానున్నాయి. రేపు(జూన్ 12,2020) ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రిలీజ్ చేస్తారని అధికారులు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించ లేదు. పరీక్షల ఫలితాలను విడుదల చేశాక అధికారులు ఈ తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇంటర్ బోర్డు అధికారులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇటీవలే మూల్యాంకనాన్ని(వాల్యుయేషన్) పూర్తి చేశారు.
 

ఏపీలో మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ ఫస్టియర్, మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరిగాయి. 5.10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 5.17 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారని అంచనా. ఏపీ బోర్డాఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ లో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.

మరోవైపు ఏపీలో యథావిథిగా షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించి తీరుతామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా పలు రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. ఎగ్జామ్స్ లేకుండానే విద్యార్థులందర్నీ పాస్ చేస్తూ.. పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేస్తారనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన మంత్రి, పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.

Read: టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలపై సీబీఐ విచారణ, ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం

Related Posts