లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

హోటల్ పేరు ‘పొట్ట పెంచుదాం’ : తగ్గిందామనుకుంటే పెంచమంటారేంటయ్యా బాబూ..

Published

on

AP hotal Named potta penchudaam : కొన్ని హోటల్స్ పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. వింటే చాలు నవ్వొచ్చేస్తుంది. ఈ పేరేంటిరా బాబూ అనిపిస్తుంది. అటువంటి ఓ వింత పేరుగల హోటల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హోటల్ పేరు వింటే మొదట భయమేస్తుంది. బాబోయ్ ఒళ్లు..పొట్ట తగ్గిందామని అనుకుంటుంటే ఇదే హోటల్ రా బాబూ అనిపిస్తుంది. కానీ..పేరే అంత వెరైటీగా ఉంటే లోపల ఫుడ్ ఇంకెంత టేస్టీగా ఉంటుందో..ఓసారి వెళ్లొద్దాం అనికూడా అనిపిస్తుంది. ఇంతకీ ఆ హోటల్ పేరేంటంటే..’పొట్ట పెంచుదాం’..!! ఏంటీ షాక్ అయ్యారా..పేరు విని..! తిండి తగ్గిద్దాం..పొట్ట తగ్గిద్దామనుకుంటే ఈ ‘పొట్ట పెంచుదాం’ ఏంటిరా ద్యావుడా అనిపిస్తోంది కదూ..

చర్చనీయాంశంగా మారిన ఈ ఈ రెస్టారెంట్ ఎక్కడుందంటే..ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పట్టణంలో ఉంది. వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాకి ఎక్కి వైరల్ గా మారింది.  గతంలో కూడా ఇలాంటి చాలా పేర్లు వైరల్ అయ్యాయి. తిన్నంత భోజనం, తినేసి పో, ఉప్పు కారం, దిబ్బ రొట్టె, అద్భుతః, కోడి కూర చిట్టి గారే, దా తిను, అమ్మ ముద్ద, పచ్చిపులుసు, భలే టేస్టీ ఇలా ఎన్నో పేర్లు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మామూలుగా బయట తిండి తినడం ద్వారా పొట్ట పెరుగుతుందని ఇళ్లలో వాళ్ళు అలా బయట తినవద్దని సలహాలు ఇస్తూ ఉంటారు, ఇప్పుడు ఏకంగా ఒక రెస్టారెంట్ ఆ పేరుతో ఏర్పాటు కావడం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది..భలే ఉందీ ఈ ‘పొట్ట పెంచుదాం’..!! కాగా..ఈ మధ్య కాలంలో జనాలు వెరైటీ ఫుడ్ ని ఇష్టపడుతున్నారు. ఈక్రమలో కష్టమర్లను ఆకట్టుకోవటానికి కొత్తగా వ్యాపారం లోకి దిగేవారు ఇలా వింత వింత పేర్లతో ఆకట్టుకుంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *