లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

6 రోజుల పసిబిడ్డతో భర్త అంత్యక్రియల్లో బాలింత..సొమ్మసిల్లి పడిపోయిన విషాదం

Published

on

AP wife attend husband funerals 6 days old baby : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకున్న ఓ అమ్మాయి జీవితం ఛిద్రమైపోయింది. కోటి ఆశలతో పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటైన ప్రేమజంట జీవితంలో అంతులేని విషాదం కమ్ముకుంది. కన్నవారిని ఎదిరించి ప్రేమించినవాడిని పెళ్లి చేసుకున్న ఓ యువతికి పండంటి బిడ్డ పుట్టింది. ఆ ఆనందాన్ని ఆ దంపతులు తనివితీరా ఆస్వాదించకుండానే వారి జీవితాల్లో విధి వింత విషాదాన్ని నింపింది. బిడ్డ పుట్టిన పట్టుమని 10రోజులు కూడా కాకుండానే ఆమె భర్తను కోల్పోయింది.

ప్రమాదంలో గాయపడిన భర్త ప్రాణాలతో సురక్షితంగా ఇంటికి వస్తాడని ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన ఆమెకు గుండెలు పగిలిపోయే ఘటనతో కుప్పకూలిపోయింది. భర్త చనిపోయాడని తెలుసుకుని పసిబిడ్డతో గుండెలవిసేలా ఏడ్చింది. కంటిలో కన్నీరు ఇంకిపోయేలా ఏడ్చింది. అలా భర్త మృతదేహాన్ని చూసిన ఆ అభాగ్యురాలు భర్తను విడిచి ఉండలేక అంత్యక్రియలకు తీసుకెళుతుండా వెంటే ‘ఆరు రోజుల’ పసిబిడ్డతో వెళ్లింది. అలా నడచీ నడచీ దారిలోనే సొమ్మసిల్లిపడిపోయింది. ఈ అత్యంత విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఆదివారం (జనవరి 10,2021) జరిగింది.

చిత్తూరు జిల్లా కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర అనే 25ఏళ్ల యువకుడు గత శుక్రవారం (జనవరి 8) రాత్రి ఓ బైక్ ఢీకొని తీవ్ర గాయాలపాలై తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎదిగొచ్చిన కొడుకు చనిపోవటంతో గంగాధర తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కొడుకు చనిపోయాడనే వార్తను కోడలు మంగమ్మతో చెప్పటానికి వారికి ధైర్యం సరిపోలేదు. కారణం…పెద్దల్ని ఎదిరించి తన కొడుకుని పెళ్లిచేసుకుంది. వారికి ఓ బిడ్డ పుట్టి పట్టుమని 10రోజులు కూడా కాలేదు.ఈ సమయంలో కొడుకు మరణవార్తను కోడలికి చెప్పలేదు. ‘‘చికిత్స జరుగుతోంది..త్వరలోనే కోలుకుని క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడు…అని నచ్చచెబుతున్నారు.ఈ క్రమంలో బాలింతగా ఉన్న మంగమ్మ భర్తను చూడటానికి కోడలు హాస్పిటల్ కు వస్తానని అన్నా ..పసిబిడ్డతో హాస్పిటల్ కు వద్దు..మేంఉన్నాం కదా చూసుకోవటానికి అంటూ మభ్యపెట్టారు.

ఈక్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గంగాధర ఆదివారం చనిపోయాడు. దీంతో కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకుని రావటంతో అసలు విషయం అప్పుడే తెలిసింది మంగమ్మకు. భర్త మృతదేహాన్ని చూసిన ఆమె ఒడిలో ఉన్న చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భోరున ఏడుస్తూ..‘ భర్త లేని జీవితం తనకు వద్దంటూ కంటికి కడివెడుగా విలపించడం అక్కడి వారందరిని కంటతడిపెట్టించింది.

ఆరు రోజుల పసికందుతో భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న కోడలిని ఓదార్చటం గంగాధర తల్లిదండ్రులకే కాదు అక్కడున్న ఎవ్వరికీ సాధ్యం కాలేదు. ఈక్రమంలో గంగాధర మృతదేహానికి అత్యక్రియలు నిర్వహించాలి కాబట్టి..చివరి యాత్ర ప్రారంభమైంది. దీంతో మంగమ్మ కట్టలు తెంచుకున్న సముద్రమే అయ్యింది. భర్త మృతదేహాన్ని విడిచిపెట్టలేకపోయింది. అంత్యక్రియలకు తీసుకువెళుతుండగా నేను కూడా వస్తానని ఆ కాస్తసేపైనా భర్తను చూసుకుంటానని వెంటనే వచ్చింది. అలా మూడు కిలోమీటర్లు నడచి..నడిచీ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమె పరిస్థితిని కంటతడి పెట్టటం తప్ప మరేమీ చేయలేకపోయారు స్థానికులు.

కానీ..కాలం ఎవ్వరి కోసం ఆగదుకదా..గంగాధర మృతదేహానికి అంత్యక్రియలు జరిగే క్రమంలో అతని చెల్లెలు భవాని శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా అన్న పాడె మోసింది. ఈ అత్యంత విషాదకర దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి. అందరినీ కంటతడి పెట్టించాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *