లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీలో పంచాయతీ ఎన్నికలు..ఓటుకు శ్రీవారి లడ్డు

Published

on

Tirupati Laddu For Voters : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు దూసుకపోతున్నారు. అయితే..ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పంథాను ఎన్నుకుంటున్నారు. తాజాగా..కొత్త ట్రెండ్ కు తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు తిరుమల శ్రీవారి లడ్డూలను ఆఫర్ చేస్తున్నారు. తిరుపతిలోని తొండవాడలో ఓటర్లకు శ్రీవారి లడ్డూలను పంపిణీ చేశారు.

అది కూడా రేషన్ పంపిణీ చేసే వాహనంలో లడ్డూలను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి పంచడం హాట్ టాపిక్ అయ్యింది. కుటుంబానికి ఐదు నుంచి పది లడ్డూలు పంచడం చర్చనీయాంశమైంది. సర్పంచ్ అభ్యర్థిని స్థానికంగా ఉన్న యువకులు పట్టుకున్నారు. వాలంటీర్లే లడ్డూలను పంచుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. లడ్డూలను ఎవరు పంచుతున్నారనేది తెలియడం లేదు. ఎందుకంటే..ఇక్కడి నుంచి వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులున్నారు. టీడీపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. లడ్డూలను పంచుతున్నారన్న విషయం తెలుసుకున్న స్వతంత్ర అభ్యర్థి వాహనాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ దీనిపై ఫోకస్ పెట్టింది. లడ్డూలను ఎవరు పంచుతున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు.