లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కేంద్ర జలశక్తి మంత్రితో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ..పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరిన బుగ్గన

Published

on

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ ముగిసింది. 20 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3500 కోట్లు పెండింగ్ నిధులను విడుదల చేయాలని బుగ్గన..షేకావత్ ను కోరారు. రాష్ట్రానికి పెట్టిన ఖర్చు ఎప్పటికప్పుడు తిరిగి వచ్చేందుకు, ఇతర నీటికి సంబంధించిన అంశాలను కూడా చర్చించామని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుు నేరుగా నిధులు కేటాయించేందుకు ఒక రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేసినట్లైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు నేరుగా ఇటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్ద, ఇతర సంస్థ వద్ద రివాల్సింగ్ ఫండ్ ను ఉంచినట్లైతే నేరుగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల కోసం కేంద్రం వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి, జల శక్తి మంత్రితత్వశాఖను అడిగి ఖర్చు చేసిన అప్రూవల్స్ తర్వాత ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి.

కాబట్టి రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేస్తే త్వరగా నిధుల విడుదలవుతాయి. అలాగే పనులు కూడా వేగవంతంగా పూర్తై ప్రాజెక్టు నిర్మాణం వేగంగా పూర్తి అవుతుందన్న అంశాన్ని కేంద్ర మంత్రి కేంద్ర జలశక్తి గజేంద్రసింగ్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్ కూడా నేరుగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, జల వివాదాల అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఏవిధంగా జరుగుతున్నాయి.. అలాగే ప్రాజెక్టుకు
సంబంధించిన నిధుల కేటాయంపు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు త్వరలోనే సమావేశం ఉండబోతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జూన్ లో జగన్ ఢిల్లీకి రావాల్సివుంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ పర్యటన రద్దైంది.

ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..ముఖ్యమంత్రి వినతులను ఈరోజు కేంద్ర మంత్రులకు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా జలశక్తి మంత్రితో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ ఇచ్చిన వినతులను కేంద్ర మంత్రలుకు అందజేశారు. నీతి ఆయోగ్ అధికారులతో కూడా మరికాసేపట్లో భేటీ ఉంది.

రాయలసీమ వెనుకబడిన జిల్లాల్లో చేపట్టబోయే పథకాలు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ఉద్దానంలో చేపట్టబోయే పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నీతి ఆయోగ్ కు కొన్ని సిఫార్సులు చేయబోతుంది. ఆ పథకాలకు నిధులు కేటాయింపు చేసేలా చూడాలని నీతి ఆయోగ్ కు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేయబోతుంది. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ రద్దు అయిన తర్వాత ఏ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలన్న అది నీతి ఆయోగ్ సూచనల మేరకే కేంద్రం నిధులు కేటాయిస్తుంది.

కాబట్టి నీతి ఆయోగ్ అధికారులను కడా కలిసి కొన్ని కీలక పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న అంశాలను నీతిఆయోగ్ అధికారులకు వివరించబోతున్నారు. బుగ్గన పర్యటనలో ఏపీకి పెండింగ్ నిధులు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సంబంధించిన మరోసారి కేంద్రం వద్దు తీసుకొచ్చారు. కేంద్రం బుగ్గన పర్యటనకు, వినతులకు ఎంత మేరకు ప్రాధాన్యతనిస్తుందో చూడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *