లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కాళ్ల మీద పడబోయి దాడికి యత్నించాడు : మంత్రి పేర్ని నాని

Published

on

perni Nani respond attack : ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై తాపీ మేస్త్రీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాపీతో మంత్రిపై దాడి చేశాడు. అయితే మంత్రి తృటిలో తప్పించుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.దాడిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. తన ఇంటి గేటు దగ్గర కాళ్ల మీద పడబోయి దాడికి యత్నించాడని పేర్కొన్నారు. పొట్టలో పొడిచేందుకు తాపీని బయటకు తీశాడని తెలిపారు. పొడవబోతుంటే తన సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదు…చొక్కా చిరిగిందని చెప్పారు.మచిలీపట్నంలోని తన సొంత నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తోన్న సమయంలో తాపీ మేస్త్రిగా పని చేస్తున్న బడుగు నాగేశ్వరారావు అనే వ్యక్తి మంత్రిపై దాడి చేశాడు. మంత్రి కాళ్లకు దండం పెట్టడానికి వెళ్లినట్లుగా వెళ్లి అనూహ్యంగా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న తాపీతో కొట్టబోయాడు. సకాలంలో అతని కదలికలను గుర్తించిన అనుచరులు ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *