ap-minister-vellampalli-srinivas-tested-corona-positive

మంత్రి వెల్లంపల్లికి కరోనా, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌ పక్కనే ఉన్న మంత్రి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

vellampalli srinivas rao corona positive: ఏపీ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‍ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్ కు పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి జరిపించారు.

వారం రోజుల తిరుమలలోనే మకాం:
వివాదాల నేపధ్యంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం పాటు తిరుమలలోనే మకాం వేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు తిరుమలలోనే ఉన్న మంత్రి సెప్టెంబర్ 25న విజయవాడ చేరుకున్నారు. వారం పాటు బయట ఉండి రావడంతో ముందు జాగ్రత్తగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోగా.. స్వల్పంగా కోవిడ్ లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

జగన్ సమీపంలో మంత్రి:
తిరుమలలో స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి సమీపంలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలోనూ ఉన్నారు. సీఎం జగన్ హైదరాబాద్ బయల్దేరే సమయంలో కూడా సమీపంలోనే ఉన్నారు. మంత్రి వెల్లంపల్లికి కరోనా వైరస్ సోకడంతో.. సీఎం జగన్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే బ్రహ్మోత్సవాలు జరిగి.. చాలా రోజులు అవుతోందని… ఆ సమయంలో మంత్రికి వైరస్ సోకి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తగ్గుముఖం పట్టిన కేసులు, పెరిగిన రికవరీ:
ఏపీలో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో డిశ్చార్జిలు సంఖ్య బాగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 10 శాతం కంటే తక్కువగా పడిపోయాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఈ ఒక్క జిల్లాలోనే ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 75వేల 990 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7వేల 293 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 6లక్షల 68వేల 751కు చేరుకున్నాయి.

READ  ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... రాజధాని భూములు వాపస్

అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు మళ్లీ పెరిగాయి. ఇటీవలే 50 కంటే తక్కువగా పడిపోయిన మరణాలు.. తాజాగా మళ్లీ పెరిగాయి. కరోనా బారినపడి 57 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5వేల 663కు చేరుకుంది.

కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. శనివారం 9వేల 125 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 6లక్షల 68వేల 751 పాజిటివ్ కేసులకు గాను 5లక్షల 97వేల 294 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 65వేల 794 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంటే యాక్టివ్ కేసుల సంఖ్య 10 శాతం కంటే తక్కువ. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ రెండు జిల్లాల్లో కలిసి లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 93వేల 184 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 63వేల 504 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.


Related Posts