హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు. శుక్రవారం (జనవరి 10, 2020) విజయవాడలో హైపవర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చర్చ జరిగిందన్నారు. జనవరి 13న మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆందోళనలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రతీ ఒక్కరి సూచనలు కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. వికేంద్రీకరణ 13 జిల్లాల్లో సమాంతరంగా జరగాలన్నారు.
25 ఎంపీ స్థానాలకు 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలిచిందని మంత్రి కన్నబాబు అన్నారు. జగన్ చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి వద్దా అని ప్రశ్నించారు. చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారని విమర్శించారు. అమరావతిలో భూ దందా నడిపి చంద్రబాబు లబ్ధి పొందాలకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. ధర్నాలు, ఆందోళనలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు.
కాపుల ఉద్యమాన్ని చంద్రబాబు అణచి వేశారని కన్నబాబు చెప్పారు. కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించి రైతులను రోడ్డుపైకి లాగుతున్నారని విమర్శించారు. జోలే పట్టుకొని వసూలు చేసిన డబ్బును ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ప్రాంతాలు, కులాల వారీగా చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు మింగేశారని ఆరోపిణలు చేశారు.