లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల ఆందోళనలు : అందరి చూపు సుప్రీంకోర్టు వైపు

Published

on

AP Panchayat Nomination : స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2021, జనవరి 25వ తేదీ సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. దీంతో నామినేషన్లు దాఖలు చేయాలని భావించిన వారికి నిరాశ ఎదురయింది. అధికారుల తీరుకు నిరసనగా కొన్నిచోట్ల అభ్యర్ధులు ఆందోళనలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి పంచాయతీ దగ్గర నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు అభ్యర్ధులు. మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఆందోళన జరిపారు. నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఎవరూ హాజరుకాకపోవడంపై నిరసన తెలిపారు. తక్షణమే అధికారులు వచ్చి నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు : –
ఏపీలో హై టెన్షన్‌ నెలకొంది. అందరి కళ్లూ సుప్రీంకోర్టు వైపే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎన్నికల కమిషన్‌తో పాటు రాజకీయపార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పదవీకాలం పూర్తయ్యేలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ పట్టుదల ఫలిస్తుందా? ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయాలని భావిస్తున్న ప్రభుత్వ పంతం నెరవేరుతుందా? అన్నది ఈ మధ్యాహ్నం తేలనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కిషన్‌ కౌల్, జస్టిస్ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు పిటిషన్‌ను విచారణ జరపనుంది.

హైకోర్టు తీర్పు తర్వాత : –
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఎన్నికల షెడ్యూల్ కొట్టివేసింది. తర్వాత ఈసీ వేసిన రిట్ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర అధికారులతో సమావేశం కావాలని భావించారు. అయితే ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేశాయి. హైకోర్టు తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు : –
సుప్రీంకోర్టు ఏ ఆదేశాలిచ్చినా పాటించేందుకు సిద్ధమని చెప్తూ నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లు చేస్తుండగా…పిటిషన్ దాఖలు చేశామన్న కారణాన్ని చూపిస్తూ ప్రభుత్వం, ఉద్యోగసంఘాలు ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదు. కరోనా పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టలేమని, వ్యాక్సినేషన్ తర్వాతే ఎన్నికల విధులు నిర్వహిస్తామని ఉద్యోగులు అంటున్నారు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్ని కలు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్ని కలంటే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడమేనని వాదిస్తోంది.

సుప్రీంకోర్టు తీర్పు : –
ఫిబ్రవరి మొదటివారంలో పోలీసులకు వ్యాక్సిన్ అందించాల్సి ఉందని, ఆ సమయంలో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని తెలిపింది. ఎన్నికల కమిషనర్ దురుద్దేశంతోనే షెడ్యూల్ ఇచ్చారని, హైకోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌కు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.