పాత మిత్రుల సోషల్ మీడియా వార్‌.. అదే టీడీపీకి మంట!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో టీడీపీకి సింపతీతో పాటు కొంత పట్టు కూడా పెరుగుతోందని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నేనున్నానంటూ తెరపైకి వస్తున్నారంట ఆ జాతీయ పార్టీ నేత. సరిగ్గా అక్కడే టీడీపీకి మంట పుడుతోందని అంటున్నారు.

అంతే దీనిని తట్టుకోలేని టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు కుమ్మరిస్తున్నారు. అందులో ఒకటి అనుచితంగా ఉండడంతో ఆ నాయకుడి మనసు చివుక్కుమనిపించేసిందంట. ప్రభుత్వమే కేసులు పెట్టాలా? తాను కూడా పెట్టేస్తానంటూ.. సీఐడి పోలీసులకు బీజేపీ తరఫున ఫిర్యాదు ఇప్పించేశారు. అంతేనా ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. మాకు కూడా సోషల్‌ మీడియా‌ ఉంది జాగ్రత్త అంటూ టీడీపీతో అమీతుమీకి సిద్ధమయ్యారు.



ఏపీలో రాజకీయ పార్టీల సోషల్ మీడియాలు కాస్త ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటున్నాయి. అధికార వైసీపీతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల సోషల్‌ మీడియాలు చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టింగులపై ఇప్పటిదాకా ప్రతిపక్ష టీడీపీకి చెందిన పలువురిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

ఇప్పుడు తొలిసారి బీజేపీ సైతం ఫిర్యాదులకు దిగింది. మూడు రాజధానులు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడుతోన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును ఉద్దేశించి టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఒకరు చేసిన అనుచిత వ్యాఖ్యలు బీజేపీకి బాగా కోపం తెప్పించిందంట. అంతే ఏకంగా సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసి మరీ యాక్షన్ తీసుకోవాలని పై నుంచి చెప్పించారని అంటున్నారు.

వైసీపీకి ఏ కష్టం వచ్చినా :
ముళ్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా… అరిటాకెళ్లి ముళ్లు మీద పడ్డా అరిటాకుకే నష్టం… ఏపీలో అయితే అచ్చంగా జీవీఎల్‌ను దేనితో పోల్చాలో టీడీపీ నేతలకు అర్థం కావడం లేదంట. వైసీపీకి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉన్నానంటూ జీవీఎల్ రెడీ అయిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన తీరును జీర్ణించుకోలేని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త జీవీఎల్‌ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీనిపై గరంగరమైన జీవీఎల్ తన అనుచరులతో టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టుపై మంగళగిరి సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తాము కూడా యాక్టివ్‌గానే ఉన్నామని చెప్పుకుంటోంది బీజేపీ. కానీ టీడీపీతో పోల్చి చూస్తే బీజేపీ సోషల్‌ మీడియాకు అంత సీన్‌ లేదన్నది జనాల మాట.



నిజానికి ఈ సోషల్‌ మీడియా వార్‌లో టీడీపీని తట్టుకోవడం బీజేపీకి కష్టమే. అందుకే ప్రభుత్వం తీరుగానే బీజేపీ కూడా కేసులు పెడుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులైన తర్వాత టీడీపీ విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

READ  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్

చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు చేసే వివిధ ప్రకటనలపై వైసీపీ కంటే ముందుగానే బీజేపీ కౌంటర్లు ఇస్తుండటంతో టీడీపీ సోషల్ మీడియా ద్వారా బీజేపీని టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ఇప్పుడు జీవీఎల్‌పై అనుచిత కామెంట్లు చేసిన టీడీపీ కార్యకర్తపైనా పార్టీ పరంగానే ఫిర్యాదు చేయడం విశేషం.

జీవీఎల్ కామెంట్లపై రగడ :
ఏపీని కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన కామెంట్లపై టీడీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో వైసీపీ, బీజేపీ కలసి నాటకాలాడుతున్నాయని ఇరు పార్టీల నేతలూ ఒకే చోట తయారైన స్క్రిప్టును చదువుతున్నారని, కేంద్రానికి సంబంధం లేకుంటే కేసుల్లో ప్రతివాదిగా ఎందుకుందో జీవీఎల్ చెప్పాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు.

మూడు రాజధానులు, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో జీవీఎల్ చేస్తోన్న కామెంట్లు ఆయన వ్యక్తిగతమై ఉండొచ్చని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన మాటలు అసంబద్ధంగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్‌ చేశారు.



జాతీయ పార్టీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తాయని రఘురామకృష్ణంరాజు గుర్తు చేయడంతో జీవీఎల్, రఘు రామకృష్ణంరాజు ఫోటోలను సోషల్‌మీడియాలో పెట్టి వీరు ఏ పార్టీ వారో చెప్పాలని ఎస్ఎంఎస్ పోల్ పెట్టి మరీ ఆడుకుంటోంది సోషల్‌ మీడియా. సోషల్ మీడియాలో టీడీపీది బలమైన వింగ్.

ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న బీజేపీ… తెలుగుదేశం పార్టీని దీటుగా ఎదుర్కొంటుందా లేక సోషల్‌ మీడియాలో సెటైర్ల ధాటికి సైలెంట్‌గా దండం పెట్టి వెనుతిరుగుతుందా? లేక ప్రభుత్వం తరహాలోనే కేసులు పెడుతూ ముందుకు వెళ్తుందో చూడాలని అంటున్నారు.

Related Posts