Ap rare devanga cats in tirumala seshachalam forest

శేషాచలం అడవుల్లో కనిపించిన అరుదైన దేవాంగ పిల్లులు..లాక్‌డౌన్ స్వేచ్ఛలో కనువిందు చేస్తున్న వన్యప్రాణులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తిరుమల శేషాచలం అడవుల్లో రెండు అరుదైన దేవాంగ పిల్లులు కనిపించాయి. రోడ్డు నిర్మాణ కార్మికులు శేషాచలం అటవీప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా..పెద్ద పెద్ద కళ్లతో విచిత్రంగా కనిపించినవాటిని చూసిన కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన అధికారులు వాటిని చూసి అవి చాలా అరుదైన దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు.

ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవనీ..శేషాచలం అడవుల్లో నివసిస్తుంటాయనీ..కొన్ని గిరిజన జాతులవారు ఈ దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని నమ్ముతుంటారని తెలిపారు.శేషాచలం అడవుల్లో కనిపించిన ఈ అరుదైన దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల సైజులో ఉంటాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 ఏళ్లు

లాక్ డౌన్ తో వన్యప్రాణులకు స్వేచ్ఛ లభించింది. ఈ భూమి మనుషులకే మాది కూడా అంటున్నాయి.అన్ని ప్రాంతాల్లోను పెరుగుతున్న జనాభాతో ఆఖరిని అడవులను కూడా నరుక్కుంటూ ఆవాసాలు ఏర్పరచుకుంటున్నారు. దీంతో అటవీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు కనిపించకుండా పోతున్నాయి. అదే పరిస్థితి తిరుమల అడవుల్లో కూడా ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల తిరుమలకు భక్తులెవ్వరూ వెళ్లకపోవటంతో తిరుమల కొండల్లోని అడవుల్లో చిరుతలు..కుందేళ్లతో పాటు ఇదిగో ఎప్పుడూ పెద్దగా కనిపించని ఇటువంటి దేవాంగ పిల్లులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ..మనుషులకు కనిపిస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. 

Read: ఏపీలో విత్తనాల ఏటీఎంలు వచ్చేస్తున్నాయి..!

Related Posts