ఏపీలో తగ్గిన కరోనా కేసులు : 24 గంటల్లో 11,803 మంది డిశ్చార్జ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ పోతుంటే.. రికవరీ అయ్యే వారి సంఖ్య క్రమంగా ఎక్కువగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,803 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.కొత్తగా 8096 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 67 మంది మృతి చెందారు. ఏపీలో 6,09,558కి చేరిన కరోనా కేసులు చేరగా, ఇప్పటివరూ రాష్ట్రంలో 5,244 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో ప్రస్తుతం 84,423 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 5,19,891 మంది డిశ్చార్జ్ అయ్యారు.గత 24 గంటల్లో 74,710 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. వారిలో 8,096 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించింది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఒక్కో జిల్లాల్లో 1000+కు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఏపీలో జిల్లాల వారీగా మరణించివారిలో కడపలో 8 మంది, చిత్తూరులో ఏడుగురు, కృష్ణలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు మరణించారు.

Related Posts