Home » పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
Published
1 month agoon
AP SEC reschedule panchayat elections : ఏపీలో జరిగే పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది.
మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
7PM టాప్ న్యూస్
బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నవారికి మరో ఛాన్స్.. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
నిమ్మగడ్డకు ఏమైంది?..ఎందుకీ మౌనం?
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట, రేషన్ డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్
మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం
మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు