Home » కరోనా వచ్చిందనే భయంతో ..పోలీసుల్ని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి : రోగంకంటే భయం మా చెడ్డది
Published
7 months agoon
By
nagamaniకరోనా వైరస్ మహమ్మారి మనుషుల్ని విచక్షణ లేకుండా ప్రవర్తించేలా చేస్తోంది. కరోనా సోకిందని కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమకు కరోనా వచ్చిందనే భయం..తనవల్ల అది తమ వారికి కూడా వచ్చేస్తుంది అనే భయంతో ఇంటినుంచి పారిపోతున్నారు. అటువంటి ఘటన ఆంధ్రప్రదేశల్ లోని కృష్ణాజిల్లాలోని విజయవాడలో జరిగింది.
విజయవాడలో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తికి జ్వరం వచ్చింది. దాంతో అతను తనకు కరోనా వచ్చిందనే భయంతో ఇంటి నుంచి గబగబా ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లాడు.కానీ వాళ్లు పట్టించుకోలేదు. అక్కడ నుంచి కోవిడ్ పరీక్షలు చేసే సెంటర్ కు వెళ్లాడు. దీంతో శ్రీనివాస్ కు డాక్టర్లు కోవిడ్ పరీక్షలు చేయటానికి నమూనాలను తీసుకున్నారు. రిపోర్ట్స్ రావటానికి కొన్ని రోజులు పడతాయనీ..చెప్పారు. కానీ శ్రీనివాస్ భయపడ్డాడు. తనకు పాజిటివ్ వస్తే..ఎలా..అది తన ఇంటిలోవారికి కూడా వచ్చేస్తుందేమోనని ఎంతగానో భయపడ్డాడు. అలా జరక్కూడదనే ఉద్ధేశ్యంతో జులై4న ఇంటినుంచి పారిపోయాడు.
దీంతో శ్రీనివాస్ భార్య తన భర్త కనిపించట్లేదంటూ విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారంరోజుల నుంచి శ్రీనివాస్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈక్రమంలో శ్రీనివాస్ రావు పరీక్షలకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా రోగం కంటే భయం మాచెడ్డది. ఆ భయంతోనే శ్రీనివాస్ ఇంటినుంచి పారిపోయాడు. తన కుటుంబానికి దూరంగా ఉండిపోయాడు. కాగా..కరోనా వచ్చిందనే భయంతో పరీక్షలు చేయించుకుని ఆ రిపోర్ట్ కాకుండానే కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపేశాడు. ఇలా భయంతోనే చాలామంది ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
Read Here>>బతికుండగానే చనిపోయాడని చెప్పిన కార్పోరేట్ ఆస్పత్రి