లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

యజమాని వేధింపులకు లొంగని ఉద్యోగిని.. రిజైన్ చేసినా ఇంటికెళ్లి మరీ..

Published

on

AP Women employer Attempted rape : వేధింపులు..వేధింపులు..వేధింపులు. ఆడది కనిపిస్తే చాలా తల్లిలా,చెల్లిలా చూడలేని కొంతమంది కామాంధులు వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలని తెలిస్తే చాలు వారేదో తమకు సొంతమన్నట్లుగా లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అటు వేధింపులు భరిస్తూనే..అవసరం కొద్దీ వాటిని భరిస్తూ ఉద్యోగాలు చేసే మహిళలెందరో ఉన్నారు. భయపడి నోరెత్తరనే అలుసుతో వారిపై తీవ్రమైన వేధింపులకు గురిచేస్తుంటారు కొంతమంది యజమానులు.

అటువంటి ఓ ఉద్యోగిని… తన యజమాని చేసే లైంగిక వేధింపులు తట్టుకోలేక..వేరే దారి లేక ఆ ఉద్యోగం మానివేసింది. అయినా ఆమెకు వేధింపులు తప్పలేదు. ఆమెపై కన్నేసినా..ఏది ఆశ చూపించినా లొంగకపోవడంతో ఏకంగా ఉద్యోగం మానేసినా సరే వదలకుండా ఆమె ఇంటికెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు..ఉద్యోగానికి రిజైన్ చేసినా వదలని కామాంధుడు
ఏపీలోని విజయవాడ HB కాలనీకి చెందిన ఓ మహిళ…మనస్పర్ధలతో భర్తనుంచి విడిపోయింది. కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటోంది. కుటుంబం గడవాలి కాబట్టి ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెపై సంస్థ ఎండీ ఋషికేశ్వరరావు కన్నేశాడు. ఆఫీసులో చనువుగా ప్రవర్తించేవాడు. దీంతో ఆమె సాధ్యమైనంత వరకూ అతనికి దూరంగా ఉండేది. అయినా సరే ఆమెను లొంగదీసుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో..విసుగొచ్చి..భయపడిన ఆమె ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్లిపోయింది.

ఉద్యోగం మానిసినా సోషల్ మీడియాలో మెసేజ్ లతో వేధింపులు
ఉద్యోగం వదిలేసాను కాబట్టి ఇక అతని బాధ ఉండదని అనుకుంది. కానీ కామంతో కళ్లు మూసుకుపోయిన ఋషికేశ్వరరావు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు. ఫోన్లు చేసి అసభ్యంగా వేధించేవాడు.దీంతో ఆమె ఆ ఫోన్ లిఫ్ట్ చేయటం మానేసింది. దీంతో వాట్సాప్ కు అశ్లీల వీడియోలు పంపిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. అయినా వాటిని భరిస్తూ వచ్చింది. ఒంటరిదాన్ని కాబట్టి ఎవరికైనా చెబితే తననే అనుమానిస్తారనే భయంతో వాటిని భరిస్తూ వచ్చింది.

ఇంటికొచ్చి అత్యాచారానికి యత్నించిన మాజీ యజమాని
దాన్ని అలుసుగా తీసుకున్న హద్దుమీరాడు ఋషికేశ్వరరావు. అలా ఆదివారం (జనవరి 2,2021) మధ్యాహ్నం ఏకంగా ఆమె ఇంటికి వచ్చేశాడు.అసభ్య పదజాలంతో ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడు. అక్కడితో ఆగకుండా ఆమె డ్రెస్ లాగేస్తూ నానా విధాలుగా వేధించాడు.‘‘నన్ను వదిలేయండా సార్..నా బతుకు నేను బతుకుతున్నాను..నన్ను అల్లరి చేయొద్దని’’ చేతులెత్తి మొక్కింది. కానీ ఆ కామాంధుడు వదల్లేదు. అత్యాచారానికి యత్నించాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన యాక్షన్ తీసుకోవటంలేదని బాధితురాలి ఆవేదన
అతడ్ని నుంచి అతి కష్టంతో తప్పించుకుంది. ఆమె నేరుగా భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన ఋషికేశ్వరరావు పారిపోయాడు. పోలీసులు ఋషికేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కానీ అతనిపై పోలీసులు యాక్షన్ తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేస్తోంది.

నిందితుడు ఋషికేశ్వరరావు కేసు నుంచి తప్పించుకునేందుకు తన పలుకుబడిని ఉపయోగిస్తు..పెద్దలతో పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఋషికేశ్వరరావు వేధిస్తూనే ఉన్నాడని..కానీ తనున్న పరిస్థితుల్లో అతనితో నాకు గొడవ ఎందుకని భయపడి వదిలేయాలని ఊరుకోకుండా నేరుగా నా ఇంటికే వచ్చి అత్యాచార యత్నం చేశాడని..అతని వల్ల తనకు ప్రమాదం ఉందని..పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకుంటే మరింత రెచ్చిపోయాడని బాధితురాలు ఆరోపించింది. ఋషికేశ్వరరావును కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.