apples-online-store-is-opening-in-india-on-september-23rd1

ఈ నెల 23న ఇండియాలో ఆపిల్ Online Store ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో కొత్త ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించనుంది. ఈ నెల (సెప్టెంబర్ 23)న ఆపిల్ ఆన్ లైన్ స్టోర్ ఓపెన్ చేయనుంది.. ఈ ఏడాదిలో దేశంలో టెక్ దిగ్గజం వ్యాపార కార్యకలాపాల పరిమితులపై నిబంధనలను భారత ప్రభుత్వం సులభంతరం చేసిన తర్వాత ఆపిల్ తమ ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించబోతోంది. దీంతో మొదటిసారిగా ఆపిల్ భారత్‌లోని కస్టమర్లకు తమ ప్రొడక్టులపై ఈ ఆన్ లైన్ స్టోర్ ద్వారా పూర్తి స్థాయిలో నేరుగా సపోర్ట్ అందించనుంది.


కంపెనీ ట్రెడ్ ఇన్ ప్రొగ్రామ్ లో ఆర్థికపరమైన ఎంపికలను యాక్సస్ చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది. ప్రస్తుతానికి ఆపిల్ తమ భారతీయ కస్టమర్లకు ప్రొడక్టులను థర్డ్ పార్టీ స్టోర్ల ద్వారా మాత్రమే విక్రయిస్తోంది. 2017లో కర్ణాటకలో ఒక ప్లాంట్ ద్వారా ఆపిల్ ఐఫోన్లను తయారు చేస్తోంది.



దేశంలో స్థానికంగా 30 శాతం తమ ఉత్పత్తులను తయారీచేసేలా విదేశీ కంపెనీలకు నిబంధన ఉంది.. దాంతో ఆపిల్ తమ రిటైల్ కార్యకలాపాలను స్థాపించలేకపోయింది. 2021లో ఇండియాలో ఆపిల్ బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్ లను ప్రారంభించనున్నట్టు కంపెనీ రివీల్ చేసింది. అందులో ఒకటి ముంబైలో మరొకటి బెంగళూరులో ప్రారంభించనుంది.



భారతీయ ఆపిల్ స్టోర్ నుంచి ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠి, తమిళ్, తెలుగు భాషల్లో Airpods ఆఫర్ చేస్తోంది. అలాగే ipad, ఆపిల్ పెన్సిల్ కోసం ఇంగ్లీష్ లో అఫర్ చేస్తోంది. కోవిడ్-19 దృష్ట్యా ఆపిల్ దేశవ్యాప్తంగా తమ స్టోర్ల నుంచి కాంటాక్ట్ లెస్ డెలివరీలను అందించేలా చర్యలు చేపట్టనుంది.

Related Posts