లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ 

Published

on

APPSC declares to recruitment process for Employment in Andhra Pradesh

ఏపీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 వరకు పలు విభాగాలకు పరీక్షలు నిర్వహించనుంది.

నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూపు 1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్ల నియామక పరీక్షలు, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్ స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీసు ఉద్యోగ నియామక పరీక్షలు, సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష, సెప్టెంబర్ 23న పోలీసు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష నిర్వహించనుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ విభాగంలో డైరెక్టర్ పోస్టులు, అదే తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్షలు, సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో  నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *