లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

APPSC: AEE సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు వచ్చేసింది

Published

on

APPSC Has Released Certificate Verification Schedule For Assistant Executive Engineers Posts

విజయవాడలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (AEE) పోస్టుల భర్తీకి సంబంధించి మే 14, 15 తేదీల్లో మెయిన్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 2న విడుదల చేసింది.

అయితే షెడ్యూలు ప్రకారం మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారని ఈ రోజు (డిసెంబర్ 11, 2019)న APPSC వెల్లడించింది. ఇక మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 527 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు APPSC ఎంపిక చేసింది.

రాష్ట్రంలోని మొత్తం 309 AEE పోస్టుల భర్తీకి న‌వంబ‌ర్ 29న APPSC నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 17న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఫిబ్రవరి 25న విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్ 18న తుది ‘కీ’ తోపాటు స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించింది.

స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షల నిర్వహించారు. జూన్ 5న ప్రాథమిక కీని, ఆగస్టు 29న రివైజ్డ్ కీని APPSC విడుదల చేసింది. డిసెంబరు 2న మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ధ్రవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *