April  month holidays are Lok Sabha candidates fear over voting percentage

సెలవులు, టూర్లు, ఎన్నికలు : అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్‌ జరుగనుంది.

బెంగళూరు : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో వరుస సెలవులు రావటంతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓటు వేసేందుకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 
ఏప్రిల్ నెలలో సెలవులు..
Read Also : కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు ఉంటాయా

ఏప్రిల్ 17న మహావీర్‌ జయంతి, 19న గుడ్‌ఫ్రైడే,  20న శనివారం, 21 ఆదివారం వారాంతపు (ఐటీ వంటి కొన్ని సంస్థలకు) సెలవులు. ఇలా లెక్కవేసుకుంటే 16 రాత్రి బయల్దేరి వెళితే వరుసగా ఐదురోజుల పాటు సెలవులు కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే ఓటింగ్ శాతంపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. దీంతో పోటీ చేసిన అభ్యర్థులు కంగారుపడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటకలోని బెంగళూరు ఐటీ సిటీగా పేరు. అక్కడ ఎక్కువగా ఉండేది ఐటీ ఉద్యోగులే. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు ఊటీ, షిర్డీ తదితర ప్రాంతాలకు లాంగ్‌టూర్‌లకు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలే రెండు రోజులు సెలవులు వస్తేనే రికాక్సేషన్ కోసం ముఖం వాచిపోయే ఐటీ ఉద్యోగులు ఏకంగా నాలుగు రోజులు సెలవులు వస్తే టూరుకు చెక్కేయకుండా ఊరుకుంటారా. నేతల గుబులంతా అందుకే.
 
ఇక పోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలు ఉంటాయి కాబట్టి సెలవు తీసుకోవడం కుదరదు. అసలే అన్ని నియోజకవర్గాల్లోనూ తీవ్ర పోటీ ఉండటంతో సెలవులను ఎంజాయ్‌ చేసేందుకు యువ ఓటర్లు చెక్కేస్తే ఎలాగని ఆయా పార్టీల అభ్యర్థులలో గుబులు ప్రారంభమైంది. అందుకే అయ్యా, అమ్మా ఓటు వేసాకా మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంటు అభ్యర్థులు తమ ప్రచారంలో వేడుకుంటున్నారు. అసలే ఎండాకాలం..పైగా వరుస సెలవులు..లాంగ్‌టూర్‌లకు డిమాండ్‌ కూడా బాగానే ఉంది.

రాజధాని పరిధిలోని మొత్తం మూడు లోక్‌సభా నియోజకవర్గాల పరిధిలో ఐటి ఉద్యోగులు, యువ ఓటర్లు ఎక్కువసంఖ్యలో ఉన్నారు. నేతల జయాపజయాలు డిసైడ్ చేసే పొజీషన్ లో ఉన్నారు. దీంతో రణంగానే వరుస సెల వులు ఎక్కడ కొంపముంచుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 
Read Also : తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు

Related Posts