లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

APSET 2019 సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్

Published

on

APSET 2019 certificate verification schedule released; check here

ఏపీలోని వివిధ యూనివర్సిటిలల్లోని డిగ్రీ కళాశాల లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అక్టోబర్ 20 న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష ఫలితాలను (డిసెంబర్ 20, 2019)న ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. తాజాగా  సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు నిర్వహించనున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ తేదిలను డిసెంబర్ 30, 2019 న విడుదల చేసింది. జనవరి 5, 2020 నుంచి జనవరి 8, 2020 వరకు సర్టిఫికేట్స్ పరీశీలన చేయనున్నట్లు తెలిపింది. 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక జత జిరాక్స్ కాపీలను తీసుకురావల్సి ఉంటుంది. ఇక పరీక్షలో అర్హత సాధించిన దివ్యాంగులకు జనవరి 8, 2020 న ఉదయం 10 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఇందుకు విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

> విశాఖ పట్నం : ఆంధ్రా విశ్వ విద్యాలయం (AU) లోని  ఆన్ లైన్ అడ్మిషన్ కేంద్రంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 
> గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని ఏపీ హెల్ప్ లైన్ సెంటర్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
> అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలోని మహాత్మా జ్యోతిరావుపూలే భవనంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 
> తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్ మెంట్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయనున్నరు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *