apsrtc merge decision

కీలక నిర్ణయం : 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖగా మార్చేందుకు మొదటి అడుగు పడింది. విజయవాడ ఆర్టీసీ బస్‌ భవన్‌లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి

రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖగా మార్చేందుకు మొదటి అడుగు పడింది. విజయవాడ ఆర్టీసీ బస్‌ భవన్‌లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి కార్మికుడి వరకు మొత్తం 52 వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సిబ్బంది పదవీ విరమణ వయస్సుని 60కి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికీ పాలక మండలి పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీలో మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న 2015 నాటి సర్క్యులర్‌ను రద్దు చేసింది. 

దీంతో పాటుగా తొలి విడతలో 350 విద్యుత్‌ బస్సులకు పాలకమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పాలక మండలి నిర్ణయాలను అధికారికంగా ప్రభుత్వానికి నివేదించనున్నారు. జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రజా రవాణశాఖ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల బెనిఫిట్లు పొందనున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అధ్యయనానికి కమిటీ వేస్తూ ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయటానికి సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో.. ప్రజారవాణ శాఖ ఏర్పాటు చేసి ఆర్టీసీని ఆ శాఖ కింద మార్చే విధంగా సిఫార్సు చేశారు. దీనిని ప్రభుత్వం ఆమోదించి.. నిబంధనల ప్రకారం ఆర్టీసీ యాజమన్యానికి తమ ప్రతిపాదన పంపింది.

దీని పై సమావేశమైన ఆర్టీసీ యాజమన్యం రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా మార్చేందుకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంలో విలీనం దిశగా తొలి అంకం పూర్తయింది. ఇక, ఉద్యోగులు..సంస్థల విషయంలోనూ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో ఆర్టీసీ విలీనం గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ భూగోళం ఉన్నంతవరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అన్నది జరగదన్నారు. అంతేకాదు.. ఏపీలో కేవలం కమిటీ మాత్రమే వేశారు.. అంతకుమించి ఏమీ జరగలేదన్నారు. 6 నెలల తర్వాత ఏమవుతుందో మీకే తెలుస్తుందన్నారు. ఏపీలో ఏం జరగనుందో ఆ దేవుడికే తెలియాలని కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ అలా అన్న కాసేపటికే.. ఆర్టీసీ విలీనంకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక కమిటీని వేశారు.

READ  పల్నాడు హీట్ : బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం - అంబటి

Related Posts