కానిస్టేబుల్ గా ఉద్యోగం..త్వరలోనే పెళ్లి..అంతలోనే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం..త్వరలోనే పెళ్లి..దీంతో ఆ యువతి..ఎన్నో కలలు కన్నది. త్వరలోనే అత్తారింటిలో అడుగుపెట్టనుంది. కానీ అంతలోనే ఆమె కలలు అన్నీ చెదిరిపోయాయి. రోడ్డు ప్రమాదంలో ఆ యువతి చనిపోయింది.

దీంతో ఆ కుటుంబసభ్యలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన పంచలింగాల చోటు చేసుకుంది. ఎమ్మిగనూర్ పట్ణణంలో నివాసం ఉండే..మల్లేష్, కొండమ్మకు నలుగురు కూతుళ్లు. కొడుకులు లేని లోటు వారిలో చూసుకున్నారు.

తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తూ..కూతుళ్లను చదివిపించారు. అనుకున్నట్లుగానే తల్లిదండ్రుల కష్టాన్ని నీరుగార్చలేదు. పెద్ద కుమార్తె లక్ష్మీ హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా..రెండో కూతురు ఇందిర టీటీసీ, మూడో కూతురు మహాదేవీ (24) ఏఆర్ కానిస్టేబుల్ గా కర్నూలులో విధులు నిర్వహిస్తోంది. చివరి అమ్మాయి నీలమ్మ డిగ్రీ చదువుతోంది.

మహాదేవీకి ఇటీవలే ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం పూర్తయ్యింది. కృష్ణాష్టమి పండుగను సందర్భంగా..మంగళవారం ఉదయం పంచలింగాల వద్ద ఉన్న రామాలయంలో పూజలు నిర్వహించేందుకు ద్విచక్రవాహనంపై మహాదేవి బయలు దేరింది.

ఆలయం వద్ద కర్నాటక రిజస్ట్రేషన్ ఉన్న ఐచర్ వాహనం బలంగా ఢీకొంది. మహాదేవీ అక్కడికక్కడనే చనిపోయింది. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం అనంతరం డెడ్ బాడీని ఎమ్మిగనూరుకు తరలించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు సంక్షేమ నిధి నుంచి మృతురాలి కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం చేశారు.

Related Posts