అయోధ్య మసీదుకు అక్తర్ డిజైన్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు జామియా మిల్లియా ఇస్లామియా ఆర్కిటెక్చర్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.ఎం.అక్తర్‌ డిజైన్లు అందించనున్నారు. ప్రొఫెసర్‌ అక్తర్‌ డిజైన్లు అందిస్తారని జామియా పీఆర్‌వో తెలిపారు. మసీదు భవన సముదాయానికి డిజైన్లు అందించేందుకు అక్తర్‌ను ఎంపిక చేసినట్లు మసీదు నిర్మాణానికి ఏర్పాటు చేసిన ఐఐసీఎఫ్‌ సంస్థ కార్యదర్శి చెప్పారు. బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసిన నేపథ్యంలో కొత్త మసీదును నిర్మించుకునేందుకు అయోధ్యలో సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాలు కేటాయించారు.ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామ జన్మ భూమి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదుకు బదులు..వేరే చోట స్థలం కేటాయించాలని ఆదేశించడంతో ధన్నీ పూర్ గ్రామంలో ప్లేస్ కేటాయించింది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.

బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు. నిర్మించబోయే మసీదుకు గ్రామ పేరు వచ్చేలా చూశారు. ఇందులో లైబ్రరీ, ఆసుపత్రి, వంటశాల నిర్మస్తామని ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక అయోధ్య విషయానికి వస్తే…అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమం తర్వాత గురువారం నుంచి పనులు మొదలుపెట్టినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టి స్వభావాన్ని పరీక్షిస్తున్నారు.

Related Posts