telegram-adding-secure-group-video-calls-year

Telegramలో ఇకపై సెక్యూర్ గ్రూపు వీడియో కాల్స్ చేసుకోవచ్చు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో కొత్త సర్వీసు రాబోతోంది. భద్రతతో కూడిన గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ ను కంపెనీ డెవలప్ చేస్తోంది. ఈ ఏడాది ఆఖరిలో సెక్యూర్ గ్రూపు వీడియో కాల్స్ సర్వీసును లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఆప్షన్లలో సెక్యూరిటీ లేదా వినియోగం ఏదో ఒకటి మాత్రమే ఉండేది. కానీ, ఈ కొత్త వెర్షన్‌లో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. టెలిగ్రామ్.. ప్లాన్లతో పాటు న్యూస్ ఆప్షన్ కూడా ప్రకటించింది. ఈ మెసేజింగ్ సర్వీసులో ఇప్పడు 400 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రెండేళ్లలో ఈ యూజర్లు రెట్టింపు కానున్నారు. 

ప్రస్తుత గ్రూపు వీడియో కాలింగ్ సర్వీసుల్లో కేవలం భద్రతా(సెక్యూరిటీ) లేదా వినియోగం (యూజబిలిటి) మాత్రమే అందించేవి. యూజర్ ఫ్రెండ్లీ జూమ్ మాదిరిగా స్వైప్ చేయడం కుదరదు. ఇటీవల నెలల్లో జూమ్ యాప్ నుంచి భిన్నమైన భద్రత లోపాలు తలెత్తాయి. జూమ్ అందించే సర్వీసులో ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ అనేది అంతా అబద్దమనే విమర్శలు వెల్లువెత్తాయి. అందులోని డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగ్స్ కారణంగా అనుమతి లేని యూజర్లను కూడా వీడియో కాల్స్ ట్యాప్ చేసేలా అనుమతించినట్టు విమర్శల వాదన. టెలిగ్రామ్‌లో షేరింగ్ కు సంబంధించి ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ డిఫాల్ట్ ఎనేబుల్ కాలేందంటూ సెక్యూరిటీ కమ్యూనిటీ విమర్శించింది. 

టెలిగ్రామ్ ప్రకారం.. 300 మిలియన్ల యూజర్లను చేరిన ఏడాది తర్వాత 400 మిలియన్ల మంది యూజర్లతో మైల్ స్టోన్ చేరినట్టు తెలిపింది. 2018 నుంచి యూజర్ బేస్ రెట్టింపు అయినట్టు పేర్కొంది. అప్పట్లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 200 మిలియన్ల మంది ఉన్నారు. ప్రతిరోజు కనీసం 1.5 మిలియన్ల కొత్త యూజర్లు sign up అయి సర్వీసును వినియోగించుకుంటున్నారని వెల్లడించింది. 20 దేశాల్లోనూ అత్యధికంగా డౌన్ లోడ్ అయిన సోషల్ మీడియా యాప్ గా టెలిగ్రామ్ నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 బిలియన్ల యూజర్లకు చేరిన వాట్సాప్‌తో పోలిస్తే టెలిగ్రామ్ యూజర్ బేస్ ఇంకా పెరుగుతూనే ఉంది. 

Related Posts