మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా? తస్మాత్ జాగ్రత్త… ఈ తప్పులు చేయకండి.. చాలామంది మొబైల్ యూజర్లు తరచుగా ఇలాంటి పొరపాట్లే చేస్తుంటారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. మీ ఫోన్ దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు టెక్ నిపుణులు.. ఛార్జింగ్ పెట్టే సమయంలో అజాగ్రత్తగా ఉంటే మీ ఫోన్ తొందరగా పాడిపోయిందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎలాంటి పొరపాట్లు ఎక్కువగా చేస్తుంటారు.

ఎలా వాటిని నివారించాలో తెలుసుకుందాం… ఫోన్ ఛార్జింగ్ దిగిపోగానే.. వెంటనే ఛార్జర్ కనెక్ట్ చేస్తుంటారు. కొంతమంది అలానే ఫోన్ వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం… ఛార్జింగ్ ఎక్కే సమయంలో ఫోన్ మాట్లాడటం ప్రాణాలకు ప్రమాదమని గుర్తించండి.. అలాగే.. ఫోన్ ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఛార్జర్ అలానే వదిలేయకూడదు. ప్లగ్ లోనే ఉంచి చాలామంది మరిచిపోతుంటారు.

100% ఛార్జింగ్ పెట్టొద్దు :
యూఎస్‌బీ కేబుల్ అలానే ప్లగ్ కు పెట్టి వదిలేస్తుంటారు. దీని వల్ల విద్యుత్ సప్లయ్ అవుతూనే ఉంటుంది. పొరపాటున ఎవరైనా అది ముట్టుకోవడం గానీ, నోట్లో పెట్టుకోవడంగానీ చేస్తే ప్రాణాలకు ప్రమాదమని గుర్తించాలి. షాట్ సర్య్కూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ప్లగ్ నుంచి యూఎస్ బీ కేబుల్ తొలగించడం మర్చిపోవద్దు. మరో తప్పు ఏంటంటే… మీ ఫోన్ ఫుల్ బ్యాటరీ అయ్యేంత వరకు ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది.

100 శాతం వరకు బ్యాటరీ ఫుల్ చేయడం ద్వారా దాని లైఫ్ టైమ్ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రతి బ్యాటరీలో ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ పరిమితుల ప్రకారం.. అన్నిసార్లు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాటరీ తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ నెలలో 100% ఒకసారి మాత్రమే బ్యాటరీ ఫుల్ చేయాలని.. ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా 20% నుంచి 80% వరకు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

రాత్రంతా ఇలా ఛార్జింగ్ పెట్టరాదు :
ఛార్జింగ్ జీరో అయ్యే వరకు ఫోన్ వాడొద్దు… ఇలా చేస్తూ పోతే.. రానురాను మీ ఫోన్ పనితీరు కూడా క్రమంగా తగ్గిపోయి తొందరగా పాడైపోయే అవకాశం ఉందని అంటున్నారు. లిథియం ఆధారిత బ్యాటరీల్లో పనిచేసే ఛార్జ్ సైకిల్స్ పనితీరు తగ్గిపోయి బ్యాటరీతో పాటు ఫోన్ కూడా పనిచేయకుండా పోతుంది. రాత్రి సమయంలో పడుకునే ముందు చాలామందికి ఫోన్ ఛార్జింగ్ పెట్టడం అలవాటు ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

READ  5 లక్షల డౌన్‌లోడ్లతో TikTok ను దాటేసిన Chinagari యాప్

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టడం ద్వారా డివైజ్ బాగా వేడిక్కి పోతుంది. కొన్నిసార్లు ఫోన్ పేలే ప్రమాదం కూడా ఉండొచ్చు. గంటల తరబడి ఫోన్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ తొందరగా పాడైపోతుంది. అత్యవసరమైన పని ఉందంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టే వాడేస్తుంటారు. కొందరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడేస్తుంటారు. ఇలా చేస్తే నెట్ వర్క్ సిగ్నల్, విద్యుత్ సిగ్నల్స్ ఒత్తిడి పెరిగిపోయి ఫోన్ చేతిలోనే పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడకపోవడమే మంచిది.

ఇలా చేస్తే.. ఫోన్ పేలిపోవచ్చు జాగ్రత్త :
మరికొంతమంది ఫోన్ ఛార్జింగ్ కొంచెం అయిపోతే చాలు.. పదే పదే ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. ఇలా కూడా చేయొద్దు.. బ్యాటరీ తొందరగా పాడైపోతుంది. మొబైల్ పౌచ్ తోనే ఛార్జింగ్ పెట్టరాదు.. ఇలా చేస్తే మీ ఫోన్లో నుంచి విడుదలయ్యే వేడి బయటకు పోదు.. తద్వారా డివైజ్ లోని ఇతర పరికరాలు వేడిక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ ఛార్జర్లు కూడా ఏది పడితే అవి వాడేయకూడదు.. ప్రతి ఫోన్ కొన్నప్పుడు దానితోపాటు ఛార్జర్ వస్తుంది.. సాధ్యమైనంత వరకు ఫోన్ సంబంధిత ఛార్జర్లు మాత్రమే వాడాలి. థర్డ్ పార్టీ ఛార్జర్లు వాడకపోవడమే మంచిది.

లేదంటే… బ్యాటరీ ఛార్జింగ్ నెమ్మదిగా ఎక్కడమే కాదు.. బ్యాటరీ తొందరగా వేడుక్కుతుంది. యాప్స్ విషయంలోనూ ఫోన్ యూజర్లు జాగ్రత్తలు పాటించాలి. ఫేక్ యాప్స్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా అవి మీ ఫోన్లో బ్యాక్ గ్రౌండ్ లో తిష్టివేసి బ్యాటరీ ఛార్జింగ్ తొందరగా అయిపోయేలా చేస్తాయి. బ్యాటరీ పనితీరు కూడా తగ్గిపోతుంది. నకిలీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోకపోవడమే మంచిది.

Related Posts