లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఈ పురుగులను తినొచ్చు అంట.. ‘మీల్ వర్మ్స్’ డైట్‌‌కు పర్మిషన్ ఇచ్చిన ఫుడ్ ఏజెన్సీ!

Published

on

Insect Diet _ These Mealworms Snack Can consume

Mealworms Snack Can consume as Insect Diet  : పురుగులు తినే అలవాటు ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై పురుగులను ఎవరైనా తినొచ్చు. చైనా వంటి చాలా దేశాల్లో పురుగులను చాలా ఇష్టంగా తింటారు. పసుపు వర్ణంలోని పురుగులను తమ డైటులో చేర్చుకుంటారు. సాధారణంగా పురుగులను ఆహారంగా తినడానికి అనుమతి ఉండదు. పురుగులను తినడం ఎంతవరకు సురక్షితమనేది తెలియదు. కానీ, యూరప్ వంటి దేశాల్లో పురుగులను తినేందుకు అనుమతినిచ్చింది అక్కడి ఫుడ్ సేఫ్టీ అథారిటీ. ఈయూలో పురుగుల డైట్‌కు మారాలనుకునేవారికి ఇదే సరైన సమయం అంటున్నారు.

యూరప్‌లో పసుపు వర్ణంలో ఉండే మీల్ వర్మ్స్ అనే బీటిల్ జాతి పురుగులను తినేందుకు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (EFSA) ఫుడ్ ఏజెన్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై అన్ని సూపర్ మార్కెట్లలో ఈ పురుగులకే ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే అక్కడెక్కడ రకరకాల జంతువులను, పక్షులను తినేస్తున్నారు. మీల్ వర్మ్స్ పురుగులను తినేందుకు అనుమతి ఇవ్వడంతో సూపర్ మార్కెట్లన్నీ పురుగుల డైట్ ప్రియులతో కళకళలాడిపోతున్నాయి.

ఈ రకమైన పురుగులు తింటే శరీరానికి ప్రోటీన్లు, విటమిన్‌లు, ఫ్యాట్ వంటి పోషక పదార్థాలు అందుతాయంట.. మొన్నటివరకూ బర్గర్లు, పాస్తా వంటి ఫాస్ట్ ఫుడ్ తిన్నవారంతా వాటికి బదులుగా ఈ పసుపు మీల్ వార్మ్స్ డైట్ గా ఎంచుకుంటున్నారు. ఒక రిపోర్టు ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలు పురుగులను తరచూ ఆహారంగా తీసుకుంటున్నారంట. దీన్ని entomophagy అంటారు. పురుగుల ఫుడ్ కు అనుమతి రావడంతో చాలామంది ఆహార నిపుణులు, చెఫ్ లు కూడా మారిపోదామని అనుకుంటున్నారంట.

ఇప్పటికే స్టార్టప్ స్టోర్ లు ఓపెన్ అయిపోయాయి. మనుషులకు, కుక్కల కోసం ప్రత్యేకించి పురుగుల మీల్స్, స్నాక్స్ సూపర్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరకే పురుగులతో మంచి పోషకాలు, ప్రోటీన్లు అందుతాయని ఎగబడి కొనేస్తున్నారు.

2019లో యూరప్ నుంచి ఈ మీల్ వార్మ్స్ పురుగుల కోసం ఒక ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అక్కడి ప్లాంటులో 1500 మెట్రిక్ టన్నుల మీల్ వార్మ్ ప్రోటీన్ ఉత్పత్తి చేస్తున్నారంట. 2050 నాటికి పెరగబోయే 9 బిలియన్ల జనాభాకు ఈ పురుగుల ఫుడ్ ప్రధాన ఆహారపు వనరుగా మారుతుందని కంపెనీలన్నీ భావిస్తున్నాయి.