‘ఆదిపురుష్’.. హనుమాన్‌గా అర్జున్ కపూర్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Adipurush-Arjun Kapoor: రెబల్‌స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ విషయంలో టీమ్ మామూలు స్పీడులో లేదు. నిన్నగాక మొన్న మూవీ అనౌన్స్ చేశారో లేదో వరుస అప్‌డేట్స్‌తో దంచి కొడుతున్నారు. ఆగస్ట్‌లో సినిమాను ప్రకటిస్తే.. సెప్టెంబర్‌లో విలన్ ఎవరనేది రివీల్ చేశారు.

ఇక ఈనెల అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్‌ను ప్రకటించబోతున్నారని సమాచారం. కట్ చేస్తే ఇంతలో హనుమంతుడి పాత్ర పోషించబోయే నటుడు ఫిక్స్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నపౌరాణిక‌ చిత్ర‌మిది. రామాయ‌ణం ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారానే యూనిట్ అనౌన్స్ చేసింది. పోస్ట‌ర్‌లో రాముడు, రావ‌ణాసురుడు, హ‌నుమంతుడు పాత్ర‌ల‌ను ఎలివేట్ చేయ‌డం ద్వారా సినిమా జోన‌ర్‌ను రివీల్ చేశారు.

Adipurush

సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనుండగా.. రాముడికి నమ్మినబంటు హనుమంతుడిగా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ నటించనున్నాడట. ఇప్పటికే ఔం రౌత్ అర్జున్ కి కథ చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సీత పాత్రలో పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి కానీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో సీత, హనుమంతుడి పాత్రలకు సంబంధించిన క్లారిటీ రానుంది.టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. మూవీని పూర్తిగా త్రీడీలో రూపొదించనుండటం విశేషం.


Related Posts