లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

భారీ మంచులో బాలింతను 6కి.మీ మోసిన జవాన్లు..వీడియో వైరల్

Updated On - 8:38 pm, Sun, 24 January 21

Army jawans carry woman దేశ రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటమే కాదు.. అపదలో ఉన్న జనానికి అండ నిలుస్తున్నారు ఆర్మీ జవాన్లు. సరిహద్దులో ఉన్నా జనం మధ్య ఉన్నా నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా మంచు కురుస్తుండటంతో నవజాత శిశువుతో హాస్పిటల్ లో చిక్కుకుపోయిన బాలింతను ఆరు కిలోమీటర్లు మోసి ఇంటికి క్షేమంగా చేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు భారత జవాన్లు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఈ ఘటన జరిగింది.

కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. 10 అంగుళాల మేర మంచు రోడ్లపై పేరుకుపోయింది. దీంతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ హిమపాతం మధ్య ఓ గర్భిణీ హాస్పిటల్ లో శిశువుకు జన్మనిచ్చింది. అయితే మంచు భారీగా కురుస్తుండటంతో బాలింత, పసిబడ్డని హాస్పిటల్ నుంచి ఇంటికి వాహనంలో తరలించలేకపోయారు. ఆమె ఇంటికి చేరేందుకు మార్గమే కనిపించకుండాపోయింది.

విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు శనివారం స్ట్రెచర్‌పై మహిళతోపాటు బిడ్డను సురక్షితంగా ఉంచి ఆరు కిలోమీటర్లు మోసి కుప్వారాలోని ఆమె ఇంటికి చేర్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. మంచుతుపానులోనూ తమకు సాయం అందించిన సైనిక సిబ్బందికి బాలింత కృతజ్ఞతలు తెలిపారు. భారీ హిమపాతాన్ని లెక్కచేయక ప్రసవించిన మహిళకు ఆర్మీ సిబ్బంది చేసిన సహాయాన్ని నెటిజన్లు కొనియాడారు.