లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

‘ఆర్మీ దుస్తుల్లో రైతు ఆందోళనలో పాల్గొనకండి’

Published

on

Farmer Protests: రైతు ఆందోళనల్లో పాల్గొనే సమయాల్లో ఆర్మీ మాజీ అధికారులకు ఆర్మీ ప్రత్యేక సూచనలు ఇచ్చింది. యూనిఫాం ధరించి లేదా గుండెలపై మెడల్స్ చిహ్నాలు ధరించి ఆందోళనల్లో పాల్గొనవద్దని చెప్పింది. కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి రూల్స్ ను లెటర్ రూపంలో తెలియజేసింది. ఆర్మీ యూనిఫాం కేవలం ప్రత్యేక ఫంక్షన్లలో మాత్రమే ధరించాలి. పబ్లిక్ సమూహాల్లో లేదా ఆందోళనల్లో కాదని గుర్తు చేసింది.

ఎక్స్ సర్వీస్‌మెన్ యూనిఫాంలు ధరించకుండా ఆందోళనల్లో పాల్గొనాలి. సిక్, పంజాబ్ రెజిమెంట్స్, ట్రూప్స్ నుంచి సేవలు అందించిన మాజీ సైనికులను ఉద్దేశించి ఇలా చెప్పారు. యూనిట్ లెవల్ ఉండే అధికారులు పర్సనల్ లీవ్స్ మీద వెళ్లి ఆందోళనల్లో పాల్గొనకూడదు. ఆర్మీ యూనిఫాంను ఆందోళనల్లో భాగం చేయొద్దు అని అధికారి చెప్పారు.

కొత్తగా ఏర్పాటైన రైతు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నెలల తరబడి చేస్తున్న ఈ ఆందోళనపై చర్చలు జరుగుతూనే ఉండగా బుధవారం పదో రౌండ్ సమావేశం జరగనుంది. ఇంకా ఈ చర్చలు ఫలించకపోతే.. రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు వెల్లడించాయి.