లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కరెంట్ బిల్లు రూ.లక్ష రావడంతో నటుడికి కోపం వచ్చింది

Published

on

Arshad Warsi complains of inflated power bill, later says 'problem solved'

ఇటీవలికాలంలో కరెంటు బిల్లులు చూస్తుంటే.. పట్టపగలే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. సామాన్యుని నుంచి సెలబ్రిటీల వరకు దేశమంతా కూడా ఇదే సమస్య. అయితే సామాన్యుడి ఆవేదన కనిపించదు. సెలబ్రిటీల గొంతు గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ విద్యుత్ బిల్లులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు రూ. లక్షకు పైగా విద్యుత్ బిల్లు వచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తన సమస్యను అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఈఎమ్ఎల్) సంప్రదించిన తరువాత పరిష్కరించినట్లు అర్షద్ వార్సీ వెల్లడించారు.

విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ బాలీవుడ్ తారలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతకుముందు, తాప్సీ పన్నూ, హుమా ఖురేషి, సోహా అలీ ఖాన్, వీర్ దాస్, పుల్కిత్ సామ్రాట్, రేణుకా షాహనే, డినో మోరియా వంటి తారలు లాక్‌డౌన్ సమయంలో తమ పెరిగిన విద్యుత్ బిల్లులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోనే అర్షద్ వార్సీ కూడా చేరారు.

లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లును పంపడంపై అర్షద్ వార్సీ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఇఎంఎల్) పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పెరిగిన విద్యుత్ బిల్లును చూసిన తరువాత, తన విద్యుత్ బిల్లును చెల్లించడానికి తన పెయింటింగ్స్ మరియు తరువాత మూత్రపిండాలను అమ్మవలసి ఉన్నట్లు అనిపిస్తుంది. అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Read Here>>జీవీకే కేసులో సంచలన విషయాలు..10 డొల్ల కంపెనీలకు రూ.395 కోట్ల నిధులు మళ్లింపు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *