Arya's Teddy First Look

ఆర్య ‘టెడ్డీ’ – ఫస్ట్ లుక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్య, సాయేషా సైగల్‌ జంటగా శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వంలో స్టూడియోగ్రీన్‌ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న‘టెడ్డీ’ ఫస్ట్‌లుక్ రిలీజ్..

తమిళ యువనటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టెడ్డీ’. పెళ్లి తర్వాత ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్‌ నటస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తుండగా.. గ్రాఫిక్స్‌తో కూడిన సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

జయం రవితో ‘టిక్‌ టిక్‌ టిక్‌’ అనే స్పై చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న సౌందర్ రాజన్ ‘టెడ్డీ’ మూవీలోనూ గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందంటున్నారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్‌ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్‌లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘‘చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్‌కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తేనే టైటిల్‌ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్‌ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు’’ అని దర్శకుడు తెలిపారు. త్వరలో ‘టెడ్డీ’ విడుదల తేది ప్రకటించనున్నారు.

Related Posts